Director Krish : ఎక్కడా కనపడని క్రిష్.. ‘హరి హర వీరమల్లు’ పై పోస్ట్.. అసలు విషయం మాత్రం చెప్పలేదు..

హరి హర వీరమల్లు ప్రమోషన్స్ లో కూడా పవన్ కళ్యాణ్, నిర్మాత, జ్యోతి కృష్ణ అందరూ మాట్లాడుతూ క్రిష్ ని అభినందించారు.

Director Krish

Director Krish : పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా మొదట జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలోనే మొదలయింది. కథ కూడా అతనిదే. కొంత షూటింగ్ అయ్యాక, ఓ గ్లింప్స్ రిలీజ్ అయ్యాక అనుకోకుండా క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దాంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు ఏఎం జ్యోతి కృష్ణ రంగంలోకి దిగి హరి హర వీరమల్లు సినిమాని మరింత గ్రాండ్ గా తెరకెక్కించాడు.

హరి హర వీరమల్లు ప్రమోషన్స్ లో కూడా పవన్ కళ్యాణ్, నిర్మాత, జ్యోతి కృష్ణ అందరూ మాట్లాడుతూ క్రిష్ ని అభినందించారు. పవన్ అయితే.. రీమేక్ లు చేస్తున్నాను అని నన్ను అందరూ తిడుతుంటే క్రిష్ ఒక మంచి ఒరిజినల్ కథ తీసుకువచ్చాడు అని అభినందించారు. సినిమా టైటిల్స్ లో డైరెక్టర్స్ గా ఇద్దరి పేర్లు వేస్తున్నా క్రిష్ మాత్రం ఎక్కడా ప్రమోషన్స్ లో కనపడట్లేదు. క్రిష్ ప్రస్తుతం అనుష్కతో ఘాటీ సినిమా చేస్తున్నాడు.

Also Read : War 2 : వార్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఆ రోజే ఎందుకంటే..

తాజాగా క్రిష్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ మరో రెండు రోజుల్లో ఉందనగా ఆ సినిమాపై స్పందిస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. క్రిష్ తన ట్వీట్ లో.. హరిహర వీరమల్లు సినిమా ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. నిశ్శబ్దంగా కాకుండా ఓ గొప్ప ఆశయంతో. ప్రతి ఫ్రేమ్ లో చరిత్ర, సినిమా మీద ప్రేమ కనిపిస్తుంది. ఈ జర్నీ కేవలం ఇద్దరు లెజెండ్స్ వల్లే సాధ్యమైంది. ఒకటి పవన్ కళ్యాణ్, రెండు నిర్మాత ఏఎం రత్నం. ఒక అసాధారణమైన శక్తికి రూపం వస్తే అదే పవన్ కళ్యాణ్ అవుతుంది. అతనిలో ఉన్న ఫైర్ ఏ కెమెరా ఫుల్ గా షూట్ చేయలేదు. ఆ పవర్ ఒక ఆశయంతో వస్తుంది. అతని ప్రతి శ్వాస హరి హర వీరమల్లు సినిమాకు ప్రాణం పోసింది. హరి హర వీరమల్లు సినిమాకు ఆయన తన ప్రాణం పెట్టి పనిచేసారు. నిర్మాత ఏఎం రత్నం ఇండియన్ సినిమాల్లో గ్రాండ్ అనుభవాలకు ఒక ఆర్కిటెక్ట్ లాంటివారు. ఎంతో విశ్వాసంతో దీన్ని నిర్మించారు. ఆయన బలమైన నమ్మకం వల్లే హరి హర వీరమల్లు సాధ్యం అయింది. నాకు ఎంతో ఉత్సాహం ఇచ్చిన సినిమాల్లో ఇది ఒకటి. కేవలం దర్శకుడిగానే కాకుండా ఈ సినిమా విషయంలో ఎంతో చరిత్ర, కనుమరుగైన నిజాలు తెలుసుకున్నాను, ఒక గొప్ప ప్రపంచం కట్టాను. పవన్ కళ్యాణ్ గారికి, ఏఎం రత్నం గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అని అన్నారు.

అయితే సినిమా గురించి, పవన్ కళ్యాణ్, నిర్మాత ఏఎం రత్నం గురించి మాట్లాడిన క్రిష్ అసలు ఈ సినిమా నుంచి ఎందుకు వెళ్లిపోయారో మాత్రం చెప్పలేదు. నిన్న ఈవెంట్లో పవన్.. క్రిష్ తన వ్యక్తిగత కారణాలతో పాటు కొన్ని ప్రొఫెషనల్ కారణాలతో వెళ్లిపోయారు అని చెప్పారు. మరి ఆ వ్యక్తిగత, ప్రొఫెషనల్ కారణాలు ఏంటో వారికే తెలియాలి. క్రిష్ కూడా చెప్పకపోవడంతో హరిహర వీరతాళ్ళు నుంచి ఎందుకు వెళ్లిపోయాడో అని ఇంకా సందేహంగానే మిగిలింది.

Also See : బ్రహ్మానందం మాటలకు పడిపడి నవ్విన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..