Lokesh Kanagaraj : ‘మా న‌గ‌రం’ మూవీ హీరోకి ఏమైంది? ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ క్లారిటీ..

మా న‌గ‌రం చిత్రంలో హీరోగా న‌టించిన శ్రీ న‌ట‌రాజ‌న్‌కు సంబంధించిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Director Lokesh Kanagaraj shares health update on Actor Shriram Natarajan

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ‘మా న‌గ‌రం’ చిత్రంలో హీరోగా న‌టించిన శ్రీ న‌ట‌రాజ‌న్‌కు సంబంధించిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అత‌డి మాన‌సిక స్థితి బాగాలేద‌ని కొంద‌రు అంటున్నారు. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ సోష‌ల్ మీడియాలో వేదిక‌గా ఓ నోట్‌ను విడుద‌ల చేశాడు.

శ్రీ ఆరోగ్యం గురించి తెలియజేస్తూ అతడి కుటుంబసభ్యులు విడుదల చేసిన స్టేట్‌మెంట్‌ను ఆయన సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు.

‘శ్రీరామ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న శ్రేయోభిలాషులు, స్నేహితులకు ఓ విష‌యం తెలియ‌జేయాల‌ని అనుకుంటున్నాం. అతడు ప్ర‌స్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. వారి సూచ‌న‌ మేరకు కొన్నిరోజుల పాటు సామాజిక మాధ్యమాలకు అత‌డు దూరంగా ఉంటాడు. అతడి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దు. అదేవిధంగా తప్పుడు కథనాలు సృష్టించవద్దు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వస్తోన్న కథనాలు చూసి కుటుంబం ఎంతో బాధపడుతుంది. త్వ‌ర‌లోనే అత‌డు కోలుకుని ఎప్ప‌టిలాగే ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తాడు. ‘అంటూ ఆ నోట్‌లో ఉంది.

 

శ్రీ న‌ట‌రాజ‌న్ అస‌లు పేరు శ్రీరామ్ న‌ట‌రాజ‌న్‌. కెరీర్ ఆరంభంలో ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టించాడు. ‘వళక్కు ఎన్‌ 18/9’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొద‌టి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఒనాయుమ్‌ ఆటకుట్టియుమ్‌’, ‘సోన్‌ పాపిడి’, ‘మా నగరం’ వంటి సినిమాల్లో న‌టించాడు.

Allu Arjun Movie : అల్లు అర్జున్ సినిమాలో ఎంతమంది హీరోయిన్స్ బ్రో.. ఇద్దరు కాదు ముగ్గురు కాదు అయిదుగురు అంట..

కాగా.. గ‌త కొన్ని రోజుల క్రితం అత‌డు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు అభ్యంత‌ర‌క‌ర వీడియోలు షేర్ చేశాడు. అందులో అత‌డు గుర్తుప‌ట్ట‌లేని విధంగా ఉన్నాడు. దీంతో అత‌డి మాన‌సిక‌, ఆరోగ్య ప‌రిస్థితి బాగాలేద‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.