Allu Arjun Movie : అల్లు అర్జున్ సినిమాలో ఎంతమంది హీరోయిన్స్ బ్రో.. ఇద్దరు కాదు ముగ్గురు కాదు అయిదుగురు అంట..
బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ హీరోయిన్స్ ఎవరా అని తెగ డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియెన్స్.

Five Heroines Shortlisted for Allu Arjun Atlee Movie Rumors goes Viral
Allu Arjun Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర్నుంచి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఇంట్రస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. సమ్మర్ అయ్యాక షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ ఎవరై ఉంటారన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది అందరిలో. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు స్కోప్ ఉందని, ముగ్గురు ఉంటారని గత కొన్ని రోజులుగా వాళ్ళు ఎవరో కూడా చెప్తూ వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా కోసం ఐదుగురు హీరోయిన్స్ ని షార్ట్ లిస్ట్ చేసారంట.
బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ హీరోయిన్స్ ఎవరా అని తెగ డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియెన్స్. ఈ లిస్ట్ లో ప్రియాంక చోప్రా, సమంత, జాన్వీకపూర్, కియారా అద్వానీ పేర్లతో పాటు లేటెస్ట్ గా దిశా పటాని పేరు కూడా వచ్చి చేరింది. అయితే మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న ప్రియాంక ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పే అవకాశం తక్కువనే చెప్పాలి.
Also See : Saanve Megghana : జిమ్ లో తెలుగమ్మాయి శాన్వి మేఘన క్యూట్ హాట్ సెల్ఫీలు.
మరోవైపు అట్లీతో మెర్సెల్, తేరి సినిమాలో చేసిన సమంత పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తిలో యాక్ట్ చేసింది సామ్. అటు డైరెక్టర్,ఇటు హీరోతో మంచి బాండింగ్ ఉండటంతో సామ్ నటించే చాన్స్ ఉందంటున్నారు ఆడియెన్స్. సమంత కూడా వెండితెరపై కనపడి చాలా కాలమైంది. ఇదే తన రీ ఎంట్రీ సినిమా అవుతుందని భావిస్తున్నారు.
ఈ హీరోయిన్ లిస్ట్ లో గట్టిగా సౌండ్ చేస్తోన్న మరో హీరోయిన్ పేరు జాన్వీకపూర్. దేవర సినిమాతో పాటు పెద్ది సినిమాలో జాన్వీనే హీరోయిన్. టాలీవుడ్ లో బిజీ కావాలని చూస్తుంది జాన్వీ. ఇప్పుడు బన్నీ ప్రాజెక్ట్ ని కూడా జాన్వీ ఓకే చేస్తే టాలీవుడ్ లో కావల్సింతన క్రేజ్ వచ్చినట్టే. అంతేకాదు బావబామ్మరిదిలో ఎవరితో బాగా సూట్ అవుతుందోనని సోషల్ మీడియాలో పోల్స్ కూడా పెట్టేస్తున్నారు.
Also Read : OG Movie : పవన్ OG లో AI వాడబోతున్న సుజీత్.. అందుకోసమే.. ఫ్యాన్స్ కి పండగే..
ఇక బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ.. భరత్ అనే నేను, గేమ్ ఛేంజర్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయింది. బన్నీతో కియారా రొమాన్స్ స్క్రీన్ పై ఓ రేంజ్ లో వర్కౌట్ అయ్యే చాన్స్ లు ఉన్నాయంటున్నారు. ఈ లిస్ట్ లోకి చివరిగా వినిపిస్తోంది దిశా పటాని పేరు. స్రీన్ పై గ్లామర్ తో పాటు యాక్షన్ సీన్స్ లోను అదరగొట్టేస్తుంది దిశా. ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి కాబట్టి దిశాని తీసుకుంటారు అని వినిపిస్తుంది.
మరి అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉంటారో, ఎవరు బన్నీ పక్కన నటిస్తారో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.