OG Movie : పవన్ OG లో AI వాడబోతున్న సుజీత్.. అందుకోసమే.. ఫ్యాన్స్ కి పండగే..

ఇప్పటి వరకు ఎవరు కూడా టాలీవుడ్ లో చెయ్యని ప్రయోగం అంటున్నారు.

OG Movie : పవన్ OG లో AI వాడబోతున్న సుజీత్.. అందుకోసమే.. ఫ్యాన్స్ కి పండగే..

Director Sujeeth Using AI Technology in Pawan Kalyan OG Movie Rumors goes Viral

Updated On : April 17, 2025 / 9:37 PM IST

OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమాపై ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. హరిహర వీరమల్లు తరువాత ఓజి రిలీజ్ కు సిద్దమవుతోంది. మరో 20 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ అయితే రిలీజ్ కు రెడీ అయినట్లే. అయితే ఇప్పుడు ఓజిలో ఓ సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడంట డైరెక్టర్ సుజిత్.

ఇప్పటి వరకు ఎవరు కూడా టాలీవుడ్ లో చెయ్యని ప్రయోగం అంటున్నారు. AIతో పవన్ కళ్యాణ్ ని ను రీ క్రియేట్ చేయబోతున్నట్లు టాక్ విన్పిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వయస్సు 53 సంవత్సరాలు. అయితే OG సినిమాలో పవన్ ప్లాష్ బ్యాక్ లో ఓ సాంగ్ ఉంటుందంట. యంగ్ ఏజ్ లో అంటే 30 ఏళ్ల వయస్సులో పవన్ ఎలా ఉన్నాడో అలా రీ క్రియేట్ చేసి మంచి సాంగ్ చేయబోతున్నారని టాక్..

Also Read : Roja – Jagapthai Babu : నిన్నేమన్నా అంటే నా బతుకు.. జట్కా బండి అయిపోద్ది.. రోజాకి కౌంటర్ ఇచ్చిన జగపతిబాబు.. ప్రోమో వైరల్..

తమ్ముడు, ఖుషి లాంటి సినిమాల్లో పవన్ డ్యాన్స్ కు ఫుల్ ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ఇప్పుడు కూడా అదే రిఫరెన్స్ గా తీసుకొని AIతో ఓ మంచి ప్లాష్ బ్యాక్ సాంగ్ చేస్తారంట. ఇప్పటికే తమిళ్ హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీలో కొన్ని సీన్స్ యంగ్ లుక్ కోసం AI వాడారట. అది బాగా వర్కౌట్ అయింది. ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. ఇప్పుడు పవన్ ను యంగ్ లుక్ లో చూపించే సాంగ్ లో కూడా AI టెక్నాలజీని వాడబోతున్నారని చిత్రవర్గాల్లో టాక్ విన్పిస్తోది.

మరి యంగ్ లుక్ లో పవన్ ఎలా డ్యాన్స్ వేశారనేది మాత్రం సినిమా రిలీజ్ అయ్యాకే తెలిసేది. అప్పటివరకు పవన్ ఫ్యాన్ వెయిట్ చేయక తప్పదు. ఇక OG సినిమా షూట్ పూర్తవ్వాలంటే పవన్ ఇంకో 20 రోజులు డేట్స్ ఇవ్వాలి.

Also Read : Nani – Suriya – Ajay Devgn : పాన్ ఇండియా సమ్మర్ ఫైట్.. నాని వర్సెస్ సూర్య వర్సెస్ అజయ్ దేవగణ్..