Nani – Suriya – Ajay Devgn : పాన్ ఇండియా సమ్మర్ ఫైట్.. నాని వర్సెస్ సూర్య వర్సెస్ అజయ్ దేవగణ్..

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ హిట్ 3 సినిమాకి పోటీగా..

Nani – Suriya – Ajay Devgn : పాన్ ఇండియా సమ్మర్ ఫైట్.. నాని వర్సెస్ సూర్య వర్సెస్ అజయ్ దేవగణ్..

Nani Hit 3 Fight with Suriya Retro and Ajay Devgn Raid 2 on Same Day

Updated On : April 17, 2025 / 8:45 PM IST

Nani – Suriya – Ajay Devgn : న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ హిట్ 3. శైలేశ్ కొలను క్రైమ్ యూనివర్స్ లో థర్ట్ పార్ట్ గా ఆడియెన్స్ ముందుకొస్తుంది ఈ సినిమా. మే 1న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆడియెన్స్ లో ఇంట్రస్టింగ్ బజ్ క్రియేట్ చేశాయి. అర్జున్ సర్కార్ గా నెవర్ బిఫోర్ అవతార్ లో కనిసిస్తోన్న నాని అగ్రెషన్ కి ఫిదా అవుతున్నారు యాక్షన్ లవర్స్. అయితే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ హిట్ 3 సినిమాకి పోటీగా అదే రోజు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రెట్రో, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ రైడ్ 2 సినిమాలు వస్తున్నాయి.

పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది రెట్రో సినిమా. సూర్య డిఫరెంట్ లుక్స్ లో కనిసిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించారు. సూర్యకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ తో పాటు మార్కెట్ కూడా ఉంది. అయితే కంగువా లాంటి డిజాస్టర్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై అనుకున్నంత బజ్ క్రియేట్ అవ్వలేదనే చెప్పాలి. సినిమాపై హైప్ పెంచేందుకు హీరోయిన్ పూజా హెగ్డేతో ప్రమోషన్స్ మొదలెట్టేశారు. ఇప్పటికే రెండు సింగిల్స్ ను రిలీజ్ చేసిన రెట్రో టీమ్ త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న సూర్య రెట్రోకి అదే రేంజ్ లో వస్తోన్న నాని హిట్ 3 గట్టి పోటీ ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు ఆడియెన్స్.

Also Read : Shine Tom Chacko : షూటింగ్ లో డ్రగ్స్ వాడాడు అంటూ ఫిర్యాదు.. మరో వైపు పోలీసులకు దొరక్కుండా పారిపోయి..?

ఇటు బాలీవుడ్ లోనూ నాని హిట్ 3 పోటీకి రెడీ అవుతోంది. మే ఫస్ట్ న రిలీజ్ అవుతోంది రైడ్ 2 మూవీ. అజయ్ దేవగణ్, రితేశ్ దేశ్ ముఖ్ లీడ్స్ రోల్స్ లో నటించారు. తమన్నా ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. 2018లో వచ్చిన సూపర్ హిట్ మూవీ రైడ్ కు సీక్వెల్ గా వస్తోంది. 40 కోట్లతో వచ్చిన రైడ్ బాక్సాఫీస్ దగ్గర 150 కోట్లు రాబట్టింది. దీంతో రైడ్ 2 సినిమాపై నార్త్ ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రజెంట్ బాక్సాఫీస్ దగ్గర వయెలెన్స్ ట్రెండ్ బాగా నడుస్తుండటంతో రెయిడ్ 2కి హిట్ 3కి మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఇటు పాన్ ఇండియా రేంజ్ లో రెట్రోకి అటు బాలీవుడ్ లో రెయిడ్ 2కి హిట్ 3 ఇచ్చే టఫ్ ఫైట్ ఎలా ఉంటుందోనని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నాని ఫ్యాన్స్.

Also Read : Uday Raj : ఒకప్పుడు ఆర్టిస్టులకు అసిస్టెంట్ గా పనిచేసి.. ఇప్పుడు హీరోగా సినిమా..