Roja – Jagapthai Babu : నిన్నేమన్నా అంటే నా బతుకు.. జట్కా బండి అయిపోద్ది.. రోజాకి కౌంటర్ ఇచ్చిన జగపతిబాబు.. ప్రోమో వైరల్..
జగపతి బాబు, ఆమని, రోజా కలిసి శుభలగ్నం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Roja Jagapthai Babu Aamani Drama Juniors Episode Promo goes Viral
Roja – Jagapthai Babu : రోజా, అనిల్ రావిపూడి జడ్జీలుగా సుధీర్ యాంకర్ గా జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో టెలికాస్ట్ అవుతుంది. చిన్న పిల్లలు వేసే కామెడీ స్కిట్స్ తో ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు ఈ షో వస్తుంది. తాజాగా కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ఎపిసోడ్ కి జగపతి బాబు, ఆమని గెస్టులుగా వచ్చారు.
జగపతి బాబు, ఆమని, రోజా కలిసి శుభలగ్నం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. తాజా ఎపిసోడ్ లో శుభలగ్నం సినిమా సీన్స్ ని రీ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు.
Also Read : Nani – Suriya – Ajay Devgn : పాన్ ఇండియా సమ్మర్ ఫైట్.. నాని వర్సెస్ సూర్య వర్సెస్ అజయ్ దేవగణ్..
ఈ ప్రోమోలో.. రోజా జగపతి బాబుని శుభలగ్నం సినిమా అప్పుడు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నానా అని అడగ్గా గతంలో రోజా ఫైర్ అయిన బతుకు జట్కా బండి షో వీడియో చూపించి జగపతి బాబు.. నిన్నేమన్నా అంటే నా బతుకు.. జట్కా బండి అయిపోద్ది అని కౌంటర్ వేశారు. ప్రోమో ఆద్యంతం సరదాగా సాగింది. మరి ఫుల్ ఎపిసోడ్ లో ఎన్ని కౌంటర్లు వేసారో ఎంత నవ్వించారో చూడాలి. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.
మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..
Also Read : Shine Tom Chacko : షూటింగ్ లో డ్రగ్స్ వాడాడు అంటూ ఫిర్యాదు.. మరో వైపు పోలీసులకు దొరక్కుండా పారిపోయి..?