×
Ad

Maruthi: ఫ్యాన్స్ కి నా క్షమాపణలు.. నేను ఏ హీరో గురించి మాట్లాడలేదు.. వివాదంలో డైరెక్టర్ మారుతీ

దర్శకుడు మారుతీ(Maruthi) వివాదంలో చిక్కుకున్నాడు. రీసెంట్ గా ఆయన రాజాసాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో ఆయన కాలర్ ఎగరేయడం గురించి కామెంట్స్ చేశారు.

Director Maruthi apologizes to NTR fans

Maruthi: దర్శకుడు మారుతీ వివాదంలో చిక్కుకున్నాడు. రీసెంట్ గా ఆయన రాజాసాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో ఆయన కాలర్ ఎగరేయడం గురించి కామెంట్స్ చేశారు. కానీ, ఆ కామెంట్స్ వివాదానికి దారితీశాయి. దీంతో స్టార్ హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దర్శకుడు మారుతిపై మండిపడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ(Maruthi) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాజాసాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.

Anil Ravipudi: అనిల్ కి మరో బంపర్ ఆఫర్.. టాప్ ప్రొడక్షన్ హౌస్ లో మూవీ.. ఈసారి టాప్ స్టార్ తో..

దీనికి సంబంధించి ఒక ఈవెంట్ ని కూడా నిర్వహించారు. ఈ సందర్బంగా దర్శకుడు మారుతీ మాట్లాడుతూ.. రాజాసాబ్ గురించి, ప్రభాస్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఆలాగే రాజాసాబ్ నుంచి అప్డేట్స్ రావడంలేదని బాధపడాల్సిన అవసరంలేదు. ఇక నుంచి వరుసగా అప్డేట్స్ వస్తూనే ఉంటాయని చెప్పాడు. ఇక రాజాసాబ్ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉంటుందని చెప్పిన మారుతీ.. నాకు ఇలా కలర్స్ ఎగరేయడం అనే మాటలు చెప్పడం రాదు. ఒకవేళ చెప్పినా ప్రభాస్ కటౌట్ కి చాలా చిన్నదవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. రీసెంట్ గా వార్ 2 సినిమా ఈవెంట్ లో ఎన్టీఆర్ తన రెండు కాలర్ లను పైకి లేపి చూపించిన విషయం తెలిసిందే.

కాబట్టి, ఎన్టీఆర్ ని తక్కువచేయడానికే మారుతీ కావాలని ఇలాంటి కామెంట్స్ చేశాడంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. మారుతీపై తీవ్రమైన ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే, తాజాగా తాను చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు దర్శకుడు మారుతీ.. “ముందుగా ఫ్యాన్స్ కి నా క్షమాపణలు. నేను ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేయలేదు. ఒకవేళ నా కామెంట్స్ పట్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి నా క్షమాపణలు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. నేను ఆయనని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేయలేదు” అంటూ రాసుకొచ్చాడు. దీంతో మారుతీ చేసిన ఈ పోస్ట్ కాస్తా వైరల్ గా మారింది. మరి మారుతీ చేసిన ఈ పోస్ట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.