Anil Ravipudi: అనిల్ కి మరో బంపర్ ఆఫర్.. టాప్ ప్రొడక్షన్ హౌస్ లో మూవీ.. ఈసారి టాప్ స్టార్ తో..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయాడు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవడం విశేషం.
Director Anil Ravipudi to make another big film under KVN Productions
Anil Ravipudi: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయాడు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అవడం విశేషం. పటాస్ నుంచి మొన్నొచ్చిన సంక్రాంతికి వస్తున్నాం వరకు ఒక్కటంటే ఒక్క ప్లాప్ లేదు ఈ దర్శకుడికి. అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్స్ సైతం సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో “మన శంకర వరప్రసాద్ గారు” అనే సినిమా చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ram Charan: ఉదయపూర్ లో రాయల్ రామ్ చరణ్.. మంతెన వారి పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. విక్టరీ వెంకంటేష్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి చేయబోయే సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, ప్రముఖ తమిళ నిర్మాత సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ అనిల్ రావిపూడితో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారట. తాజాగా ఈ ప్రాజెక్టుకి సంబందించిన చిన్న హింట్ కూడా ఇచ్చారు మేకర్స్. సంస్థ సోషల్ మీడియా అకౌంట్ నుంచి అనిల్ రావిపూడి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. మా విజనరీ దర్శకుడితో మరో భారీ సినిమా రాబోతుంది అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.
ఇక ఈ ప్రాజెక్టుకి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని టాక్ నడుస్తోంది. అడ్వాన్స్ కూడా గట్టిగానే ఇచ్చారట. అయితే, ఈ సినిమాలో తమిళ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరో ఈ ప్రాజెక్టులో నటిస్తాడు అని తెలుస్తోంది. మరి ఆ స్టార్ ఎవరో అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే, కేవీఎన్ సంస్థ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కొల్లితో సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది. ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడితో మరో క్రేజీ ప్రాజెక్టును ఒకే చేసింది ఈ సంస్థ.
