×
Ad

Director Maruthi : నిర్మాతలకు నచ్చినట్టు కథలు మార్చాల్సి వస్తుంటుంది.. మారుతి సంచలన వ్యాఖ్యలు..

తాజాగా రాజాసాబ్ దర్శకుడు మారుతి 10 టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై కామెంట్స్ చేసారు.(Director Maruthi)

Director Maruthi : సినీ పరిశ్రమలో దర్శకులు ఒక ఫైనల్ కథ, కథనం అనుకొని వెళ్తే మధ్యలో హీరోలు, నిర్మాతలు, హీరోయిన్స్, చాలా మంది ఆ కథలో వేలు పెట్టి చాలా మార్చేస్తారు అని అంటూ ఉంటారు. ఇదే విషయాన్ని చాలా మంది దర్శకులు కూడా నిజమే అని చెప్పారు. తాజాగా రాజాసాబ్ దర్శకుడు మారుతి 10 టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై కామెంట్స్ చేసారు.(Director Maruthi)

Also Read : Director Maruthi : శివాజీ చెప్పింది మంచి విషయం.. నచ్చితే తీసుకో.. మారుతి వ్యాఖ్యలు వైరల్..

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. నా చేత ఎవరు ఎలాంటి సినిమా అయినా చేయించుకోగలరు. ఎవరు ఏం చెప్పినా నా స్టైల్ పోగొట్టుకొకూడదు అనుకుంటా కానీ కుదరదు. డబ్బులు పెట్టేవాళ్లకు డబ్బులు ఇంపార్టెంట్, వాళ్లకు నచ్చేలా సినిమా చేయాలి అని కూడా ఉంటది. నేను తీసిన కొన్ని సినిమాల్లో యావరేజ్ లు ఉన్నాయి, పోయాయి కూడా. ఆ తప్పు నాదే. నా ఒరిజినాలిటీ పోగొట్టుకొకూడదు అని ట్రై చేస్తూ ఉంటా కానీ ఒక్కోసారి అవ్వదు. నిర్మాతలు కరెక్ట్ కాదు అంటే వాళ్లకు ఏది కరెక్ట్ అంటారో అదే చేసుకుంటూ వెళ్ళిపోతాము. తెలియకుండా అక్కడ క్రియేటివ్ సైడ్ అది దెబ్బ తీస్తుంది.

రాజాసాబ్ విషయంలో నాకు ఫ్రీడమ్ దొరికింది. ప్రభాస్ గారు చాలా హెల్ప్ చేసారు. నాలో రైటర్ ని గుర్తించి నా క్రియేటివిటీ బయటకు తీశారు. ప్రభాస్ గారు నా ట్యాలెంట్ గుర్తించారు కాబట్టే నేను ఎక్కువ ఫోకస్ చేశా ఈ సినిమా మీద. డైరెక్టర్ ని పూర్తిగా నమ్మాలి. అలాగే మేము చూడని తప్పులు హీరోలు, నిర్మాతలు చూసి చెప్తారు. అది చెప్తే తెలుసుకుంటాము. అన్ని పెద్ద సినిమాలు చివరి వరకు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. సినిమా బయటకు వెళ్లేంతవరకు కూడా ఆ సినిమాని చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే కరెక్ట్ వస్తుంది అవుట్ పుట్ అని అన్నారు.

Also See : Ram Charan : బేబీ బంప్ తో ఉపాసన.. చరణ్ ఇంట్లో బిర్యానీ పండగ.. ఫొటోలు వైరల్..