Dinesh Mahindra : డైరెక్టర్ గా పరిచయం కాబోతున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్ తనయుడు.. తండ్రి బాటలో తనయుడు..

ఇప్పుడు మరో దర్శకుడి వారసుడు రాబోతున్నాడు.

Director N Shankar Son Dinesh Mahindra Entry in Film Industry as Director

Dinesh Mahindra : సినీ పరిశ్రమలో వారసులు వస్తారని తెలిసిందే. చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణుల పిల్లలు కూడా సినీ పరిశ్రమలోకి వస్తూనే ఉంటారు. ఇప్పుడు మరో దర్శకుడి వారసుడు రాబోతున్నాడు. గతంలో శ్రీరాములయ్య, ఎన్‌కౌంటర్‌, జయం మనదేరా, భద్రాచలం, ఆయుధం, జై బోలో తెలంగాణ.. లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ N శంకర్ ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు.

Also Read : JACK Teaser : సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జాక్ టీజర్ చూశారా? హీరో ఏం పని చేస్తాడో తెలుసా?

అయితే N శంకర్ తనయుడు దినేష్‌ మహీంద్ర ఇప్పుడు దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వ విభాగంలో, స్క్రీన్ ప్లే విభాగంలో పలు కోర్సులను పూర్తిచేశాడు దినేష్‌ మహీంద్ర. త్వరలో ఓ ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దినేష్‌ మహీంద్ర. కొత్త నటీనటులను, కొత్త సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తూ దినేష్‌ మహీంద్ర తెరకెక్కిస్తున్న సినిమాని ఆరెక్స్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.

Also Read : Oka Pathakam Prakaram : ‘ఒక పథకం ప్రకారం’ మూవీ రివ్యూ.. సాయి రామ్ శంకర్ కంబ్యాక్ ఇచ్చాడా?

దినేష్‌ మహీంద్ర దర్శకత్వంలో తెరకెక్కబోతున్న యూత్ ఫుల్ లవ్ స్టోరీ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. మరి తండ్రి బాటలోనే తనయుడు కూడా తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తాడా చూడాలి.