Director Nag Ashwin Tweet on Prabhas Project K Movie Update
Prabhas: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-K అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ పథకంపై చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోణె నటిస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైం ట్రావెల్ నేపథ్యంతో రాబోతున్నట్లు తెలుస్తుంది.
Prabhas: ప్రభాస్, మారుతీల సినిమా టెస్ట్ షూట్ ప్రారంభం..
అయితే సినిమా ప్రకటించి చాలా రోజులు అవుతున్నప్పటికీ, ఇప్పటి వరకు సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. రేపు (అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టినరోజు కాబట్టి డార్లింగ్ అభిమానులు అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని ఈ విషయంపై ప్రశ్నించగా.. “రాధే శ్యామ్ రిలీజ్ తరవాతే ఏ అప్డేట్ అయినా” అని బదులిచ్చాడు.
తాజాగా ఒక్క అభిమాని ఆ విషయాన్ని రీ ట్వీట్ చేస్తూ.. “నాగ్ అశ్విన్ అన్న మేము గుర్తు ఉన్నామా?” అని ప్రశ్నించాడు. ఇందుకు అశ్విన్ బదులిస్తూ.. “ఒక చిన్న అప్డేట్ రాబోతుంది సిద్ధంగా ఉండండి” అంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మరి డార్లింగ్ బర్త్ డేకి నాగ్ అశ్విన్ ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడో చూడాలి.
Something small coming tom… ✌️
— Nag Ashwin (@nagashwin7) October 22, 2022