Prabhas: ప్రభాస్, మారుతీల సినిమా టెస్ట్ షూట్ ప్రారంభం..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కృష్ణంరాజు గారి మరణవార్త నుంచి బయటపడి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమా షూటింగ్ లో పాల్గొంటూ వర్క్ చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా సలార్ కొత్త షెడ్యూల్ పూర్తి చేసిన డార్లింగ్, ఈ గ్యాప్ లో మారుతీ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు.

Prabhas: ప్రభాస్, మారుతీల సినిమా టెస్ట్ షూట్ ప్రారంభం..

Prabhas Maruthi Movie Test Shoot Starts

Updated On : October 20, 2022 / 3:44 PM IST

Prabhas: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కృష్ణంరాజు గారి మరణవార్త నుంచి బయటపడి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమా షూటింగ్ లో పాల్గొంటూ వర్క్ చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా సలార్ కొత్త షెడ్యూల్ పూర్తి చేసిన డార్లింగ్, ఈ గ్యాప్ లో మారుతీ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు.

Prabhas: ప్రభాస్ రీ రిలీజ్ సినిమాలకు దొరకని థియేటర్లు..

హారర్-కామెడీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా టెస్ట్ షూట్ లో ప్రభాస్ ఈరోజు పాల్గొన్నాడట. 5 నుంచి 6 నెలల్లో సినిమాను పూర్తి చేయాలనీ మూవీ టీం భావిస్తున్నట్లు తెలుస్తుంది. డార్లింగ్ సరసన మాస్టర్ ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. కార్తికేయ 2తో విజయాన్ని అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుండగా, నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.

కాగా స‌లార్ సినిమా త‌ర్వాత ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-K కూడా ఏకకాలంలో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట ప్రభాస్. బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే మరియు అమితాబ్ బచ్చన్‌ ఈ సినిమాలో నటించబోతున్నారు.