Director Nandini Reddy Strike in Mahesh Babu Movie Shoot Krishna Vamsi Replied
Mahesh Babu – Nandini Reddy : మహేష్ బాబు క్లాసిక్ హిట్ సినిమా మురారి ఇటీవల మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9న రీ రిలీజ్ అయి భారీ కలెక్షన్స్ రాబట్టింది. మురారి సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, టెక్నిషియన్స్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. వర్షం డైరెక్టర్ శోభన్, డైరెక్టర్ నందిని రెడ్డి, లక్ష్యం డైరెక్టర్ శ్రీవాస్.. వీళ్లంతా మురారి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేసారు.
అయితే డైరెక్టర్ నందిని రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మురారి సినిమా గురించి మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా ఒక రోజు ధర్నా చేసాము. షూటింగ్ లో ఇంపార్టెంట్ రోజు అలా చేసాము అని చెప్పింది. కృష్ణవంశీ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ అభిమనులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని తెలిసిందే. తాజాగా ఓ నెటిజన్ నందిని రెడ్డి, టీమ్ మురారి సినిమాలో చేసిన దాని గురించి ప్రశ్నించి మీకు కోపం వచ్చిందా అని అడిగాడు.
Also Read : Venkatesh : కొత్త సినిమా షూట్ మొదలుపెట్టిన వెంకటేష్.. లుంగీ కట్టి.. లుక్ అదిరిందిగా..
దీనికి కృష్ణవంశీ సమాధానమిస్తూ.. కోపం కాదు సర్, వర్క్ లో రెస్పాన్సిబిలిటీగా లేకపోతే నేను తీసుకోలేను. అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫ్యూచర్ డైరెక్టర్స్. వాళ్ళు ఏదైనా చేయగలిగేలా, చేసేలా ఉండాలి. వాళ్ళు కిడ్స్ లాంటి వాళ్ళు అప్పుడు. 12 నుంచి 14 గంటలు పనిచేసిన తర్వాత ఫ్రస్టేషన్ వస్తుంది. అది నేను అర్ధం చేసుకోగలను. అందుకే కోపం రాలేదు. ఆ తర్వాత కుడా వాళ్లతో కలిసి పనిచేసాను అని తెలిపారు.
కోపం కాదు sir .. work irresponsibity I can't take .. n asst directors r future directors.. they shud b ready to take anything n every thing …. THQ ❤️ https://t.co/bWgtIMZjg3
— Krishna Vamsi (@director_kv) August 12, 2024
N they are kids out of innocence n ignorance jus exploded thinking like heroes ?????that's y I continued with them .. not angry . Can understand d frustration after working hard for 12 to 14 hrs it's natural fr rebel … ?? https://t.co/kPGYoaYfwz
— Krishna Vamsi (@director_kv) August 12, 2024