Venkatesh : కొత్త సినిమా షూట్ మొదలుపెట్టిన వెంకటేష్.. లుంగీ కట్టి.. లుక్ అదిరిందిగా..

నేడు వెంకటేష్ - అనిల్ రావిపూడికి మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తూ వెంకటేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు అని ప్రకటించారు.

Venkatesh : కొత్త సినిమా షూట్ మొదలుపెట్టిన వెంకటేష్.. లుంగీ కట్టి.. లుక్ అదిరిందిగా..

Venkatesh Joined in Anil Ravipudi Movie Shoot Making Video Released

Updated On : August 14, 2024 / 12:23 PM IST

Venkatesh : విక్టరీ వెంకటేష్ ఇటీవల సంక్రాంతికి 75వ సినిమా సైంధవ్ తో వచ్చారు. మళ్ళీ వచ్చే సంక్రాంతి టార్గెట్ పెట్టుకొని నెక్స్ట్ సినిమా రెడీ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు టైటిల్ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని పెట్టినట్టు టాక్ వినిపిస్తుంది.

Also Read : Amitabh Bachchan – Murari : మురారి సినిమా చూసి కృష్ణవంశీని రిక్వెస్ట్ చేసిన అమితాబ్ బచ్చన్.. ఏం అడిగాడో తెలుసా?

ఈసారి కామెడీ యాక్షన్ తో రాబోతుంది వెంకటేష్ అనిల్ కాంబో. అయితే ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా తాజాగా వెంకటేష్ ఈ కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. నేడు వెంకటేష్ – అనిల్ రావిపూడికి మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తూ వెంకటేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు అని ప్రకటించారు. ఇక ఈ మేకింగ్ వీడియోలో వెంకటేష్ లుంగీ, పంచ కట్టి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాలో కూడా కామెడీ బాగానే ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా ఈ మేకింగ్ వీడియో చూసేయండి..