Amitabh Bachchan – Murari : మురారి సినిమా చూసి కృష్ణవంశీని రిక్వెస్ట్ చేసిన అమితాబ్ బచ్చన్.. ఏం అడిగాడో తెలుసా?
మురారి సినిమా చూసి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ డైరెక్టర్ కృష్ణవంశీకి ఫోన్ చేసి మరీ ఓ రిక్వెస్ట్ చేసాడట.

Amitabh Bachchan Request Director Krishna Vamsi after Watching Mahesh Babu Murari Movie
Amitabh Bachchan – Murari : మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచిన సినిమా మురారి. ఇటీవల మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9న ఈ సినిమాకి రీ రిలీజ్ చేయగా కలెక్షన్స్ లో, టికెట్ సేల్స్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. మహేష్ ఫ్యాన్స్ కూడా మురారి రీ రిలీజ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మురారి సినిమా రీ రిలీజ్ సమయంలో ఆ సినిమాకి సంబంధించిన నటీనటులు, టెక్నిషియన్స్ ఇంటర్వ్యూలు ఇవ్వడంతో బోలెడన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
అయితే మురారి సినిమా చూసి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ డైరెక్టర్ కృష్ణవంశీకి ఫోన్ చేసి మరీ ఓ రిక్వెస్ట్ చేసాడట. మురారి సినిమా అమితాబ్ బచ్చన్ కి నచ్చడంతో ఆ సినిమాని బాలీవుడ్ లో తన కొడుకు అభిషేక్ బచ్చన్ తో రీమేక్ చేయమని అడిగారట. కానీ ఎందుకో ఆ సినిమా ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత తుషార్ కపూర్ ని పెట్టి కూడా బాలీవుడ్ లో ఈ సినిమాని రీమేక్ చేద్దామనుకున్నారు కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు.
Also Read : TG Vishwa Prasad : ఇండస్ట్రీలో ఆ మాఫియా ఉంది.. అందుకే ఇలా చేస్తున్నాం.. స్టార్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు..
గతంలో ఇక్కడ హిట్ అయిన సినిమాలు వేరే భాషల్లో రీమేక్ లు, వేరే సినిమాలు ఇక్కడ రీమేక్ లు మాములే. మురారి బాలీవుడ్ లో రీమేక్ అవ్వకపోయినా కన్నడలో గోపి అనే పేరుతో రీమేక్ అయింది. అక్కడ కూడా మంచి విజయం సాధించింది ఈ సినిమా