TG Vishwa Prasad : ఇండస్ట్రీలో ఆ మాఫియా ఉంది.. అందుకే ఇలా చేస్తున్నాం.. స్టార్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

పీపుల్ మీడియా అధినేత TG విశ్వప్రసాద్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసారు.

TG Vishwa Prasad : ఇండస్ట్రీలో ఆ మాఫియా ఉంది.. అందుకే ఇలా చేస్తున్నాం.. స్టార్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

People Media Factory Producer TG Vishwa Prasad Sensational Comments on Tollywood

Updated On : August 14, 2024 / 10:48 AM IST

TG Vishwa Prasad : సినీ పరిశ్రమ మీద విమర్శలు కూడా వస్తునే ఉంటాయి. ఇక్కడ కొంతమంది చేతుల్లోనే అన్ని నడుస్తాయి అని, కొత్త వాళ్ళు వస్తే కష్టం అని, కొంతమంది అన్ని వాళ్ళ గుప్పిట్లో ఉంచుకుంటారని అప్పుడప్పుడు పలువురు విమర్శలు చేస్తారు. తాజాగా స్టార్ నిర్మాత ఇండస్ట్రీలో ఓ మాఫియా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

వరుస సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. రేపు ఈ నిర్మాణ సంస్థ నుంచి మిస్టర్ బచ్చన్ సినిమా రాబోతుంది. పీపుల్ మీడియా అధినేత TG విశ్వప్రసాద్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసారు.

Also Read : Nani : నాని కోసం సుదర్శన్ థియేటర్‌కి వచ్చిన బామ్మ.. నాని ఫ్యాన్స్‌తో కలిసి సందడి..

TG విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఒక మాఫియా ఉంది. చాలామంది కెమెరామెన్ లు ముంబై లైట్ మెన్స్ లేకపోతే మేము పని చెయ్యము అంటారు. ఇక్కడ లైట్ మెన్స్ ప్రొఫెషనల్ కాదు అని అంటారు. ఇక్కడ డిపార్ట్మెంట్ అఫ్ లైటింగ్ లేదు. గాఫర్ ఒకరు ఉంటారు ఆ లైటింగ్ చూసుకోడానికి. అందుకే మేమే కొంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నాము లైటింగ్ డిపార్ట్మెంట్ లో. లైటింగ్ లో ఉండే టెక్నిక్స్, లైట్స్ ని ఎలా వాడాలి అని.. అన్ని విషయాల్లో ట్రైనింగ్ ఇప్పుస్తున్నాం కొంతమందికి. దాని మీద ఎక్కువగానే ఖర్చుపెడుతున్నాము. ఇప్పుడు ఎవరికీ ఇది అర్ధం కాకపోవచ్చు కానీ భవిష్యత్తులో అందరికి ఇది అర్ధమవుతుంది అని అన్నారు. దీంతో నిర్మాత విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ సంచలనంగా మారాయి. మరి దీనిపై ఏ సినిమాటోగ్రాఫర్ అయినా స్పందిస్తారో చూడాలి.

View this post on Instagram

A post shared by idlebrain (@idlebrain.official)