Director Nelson Kumar is making a film with Ram Charan, leaving NTR aside.
Nelson Kumar; ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న కథను మరొక హీరోతో చేయడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అలాగే, ఒక హీరోతో సినిమా అనుకోని డేట్స్ సెట్ అవక వేరే హీరోతో మరో సినిమా చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సిచువేషన్ లో ఉన్నడట దర్శకుడు నెల్సన్ కుమార్. ఈ తమిళ దర్శకుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ సినిమా చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకున్నాడు (Nelson Kumar)అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా సింపుల్ కథతో, అదిరిపోయే ఎలివేషన్స్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.700 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 చేస్తున్నాడు నెల్సన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వెచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ సినిమా తరువాత దర్శకుడు నెల్సన్ కుమార్ టాలీవుడ్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ఒక పవర్ ఫుల్ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నాడు. దీనిపై నిర్మాత, హీరో ఇద్దరు కూడా అధికారిక ప్రకటన ఇచ్చారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే నెల్సన్ సినిమా మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు.
కానీ, తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్-నెల్సన్ సినిమా ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. కారణం ఏంటంటే, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఆలస్యం కానుంది. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ లో వచ్చిన అవుట్ ఫుట్ పట్ల ఎన్టీఆర్ సంతృప్తిగా లేడట. అందుకే, చాలా సీన్స్ మళ్ళీ రే షూట్ చేసే అవకాశం ఉంది. అందుకే, ఎన్టీఆర్ సినిమాను పక్కన పెట్టేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించి ఇప్పటికే రామ్ చరణ్ ను కలిసి కథను కూడా వినిపించాడట. పెద్ది సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే నెల్సన్ సినిమా మొదలుకానుందట. ఓపక్క సుకుమార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరోపక్క నెల్సన్ సినిమా కంప్లీట్ చేయనున్నాడట రామ్ చరణ్. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.