Mass Jathara: రవి తేజ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మరోసారి వాయిదా పడ్డ “మాస్ జాతర”.. రిలీజ్ ఎప్పుడంటే?

మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా వస్తున్న మాస్ మూవీ "మాస్ జాతర". పక్కా మాస్ అండ్ కమర్షియల్(Mass Jathara) ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కించాడు.

Mass Jathara: రవి తేజ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మరోసారి వాయిదా పడ్డ “మాస్ జాతర”.. రిలీజ్ ఎప్పుడంటే?

Ravi Teja "Mass Jathara" movie postponed once again

Updated On : October 26, 2025 / 11:35 AM IST

Mass Jathara: మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా వస్తున్న మాస్ మూవీ “మాస్ జాతర”. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కించాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను (Mass Jathara)సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. చాలా కాలం క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే పాలుపర్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎక్కటకేలకు అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా అనుకున్నారు అంతా. ఇప్పుడు మరోసారి మాస్ జాతర సినిమా వాయిదా పడినట్టు తెలుస్తోంది.

Rana-Mihika: తండ్రి కాబోతున్న రానా.. దగ్గుబాటి వారింట సంబరాలు?

నిర్మాత నాగ వంశీ చెప్పినట్టుగా మాస్ జాతర సినిమాను సోలోగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు. అందులో భాగంగానే అక్టోబర్ 31 విడుదల అని అనౌన్స్ చేశారు. కానీ, అదే రోజున అనూహ్యంగా బాహుబలి ఎపిక్ సినిమా విడుదలను ప్రకటించాడు రాజమౌళి. అయినా పరవాలేదు విడుదల చేయాలని అనుకున్నారు మాస్ జాతర మేకర్స్. కానీ, బాహుబలి ఎపిక్ టికెట్స్ బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ అవగా ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ చూసిన సినిమానే కదా ఇంపాక్ట్ ఉండదేమో అనుకున్నారు. కానీ, సీన్స్ రివర్స్ అయ్యింది.

దీంతో ఆలోచనలో పడ్డ మాస్ జాతర సినిమా మేకర్స్ సినిమాను ఒకరోజు ఆలస్యంగా అంటే నవంబర్ 1న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అలా దీంతో ఇప్పటివరకు ఐదు సార్లు ఈ సినిమా వాయిదా పడింది. అయితే, ఇలా వరుసగా వాయిదాలు పడటం వల్ల సినిమాపై ఆడియన్స్ లో నెగిటీవ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటింది. మరి ఆ ఇంపాక్ట్ ని ఎంత వరకు మాస్ జాతర సినిమా ఓవర్కం చేస్తుందా అనేది చూడాలి.