Director Ram Gopal Varma shocking comments about Rahman.
Ram Gopal Varma: ఇండియన్ మ్యూజికల్ దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మతపరమైన అంశాల కారణంగా తనకు ఆఫర్స్ తగ్గాయంటూ కూడా సంచలన కామెంట్స్ చేసాడు రెహమాన్. దీంతో, ఆయన చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. సోషల్ మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున దుమారమే రేగింది. చాలా మంది ప్రముఖులు రెహమాన్ మాటలను తప్పుబట్టారు. అంతటి స్థాయిగల వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు అంటూ మండిపడ్డారు.
ఇందులో భాగంగానే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెహమాన్ గురించి మాట్లాడిన ఒక పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఇంటర్వ్యూలో రెహమాన్ గురించి సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు ఆర్జీవీ. ‘గతంలో ‘యువరాజ్’ సినిమా కోసం రెహమాన్‌ను బుక్ చేసుకున్నాడు దర్శకుడు సుభాష్ ఘై. అందుకోసం కోట్లు రూపాయలు రెమ్యునరేషన్ గా ఇచ్చారు.
Jana Nayagan: బ్యాడ్ న్యూస్.. తీర్పు మళ్ళీ వాయిదా.. జన నాయగన్ రిలీజ్ ఇప్పట్లో లేనట్టే
కానీ, సాంగ్స్ ఇవ్వడంలో రెహమాన్ ఆలస్యం చేయడంతో సుభాష్ ఘై డైరెక్ట్ రెహమాన్ స్టూడియోకి వెళ్ళాడు. అక్కడ సింగర్ సుఖ్వీందర్ సింగ్ కంపోజ్ చేసిన పాటను దర్శకుడు సుభాష్ ఘైకి వినిపించాడు రెహమాన్. దానికి సుభాష్ ఘై సీరియస్ అయ్యాడు. 3 కోట్లు ఇచ్చింది నీ మ్యూజిక్ కోసం, సుఖ్వీందర్ కోసం కాదని చెప్పాడు. దానికి, రెహమాన్ ‘‘మీరు డబ్బులు ఇచ్చింది నా పేరుకే, నా పనికి కాదు. నచ్చితే తీసుకోండి లేదంటే వేరే చేద్దాం’ అని చెప్పాడు అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.
ఆ తరువాత సుక్వీందర్ సింగ్ కంపోజ్ చేసిన ఆ సింగ్ ను స్లమ్ డాగ్ మిలియనీర్ లో వాడాడు రెహమాన్. అదే ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, ఆస్కార్ సాధించిన జై హో సాంగ్. ఆ సింగ్ తనకు ఇచ్చినందుకు సుక్వీందర్ సింగ్ కి రూ.5 లక్షల చెక్ పంపాడట రెహమాన్. ఈ విషయాన్ని సీజర్ సుక్వీందర్ సింగ్ తనతో చెప్పాడు అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.