Jana Nayagan: బ్యాడ్ న్యూస్.. తీర్పు మళ్ళీ వాయిదా.. జన నాయగన్ రిలీజ్ ఇప్పట్లో లేనట్టే

విజయ్ జన నాయగన్(Jana Nayagan) సినిమా విడుదలపై మరోసారి తీర్పు వాయిదా వేసిన కోర్టు.

Jana Nayagan: బ్యాడ్ న్యూస్.. తీర్పు మళ్ళీ వాయిదా.. జన నాయగన్ రిలీజ్ ఇప్పట్లో లేనట్టే

Vijay thalapathy Jana Nayagan movie release postponed once again.

Updated On : January 21, 2026 / 10:50 AM IST
  • జన నయగాన్ మేకర్స్ కి మరోసారి నిరాశే
  • మూవీ విడుదలపై తీర్పు మళ్ళీ వాయిదా
  • విడుదల ఇప్పట్లో లేనట్టే

Jana Nayagan: తమిళ స్టార్ విజయ్ జన నాయగన్ సినిమా విడుదలపై తీర్పు మళ్ళీ వాయిదా పడింది. మంగళవారం ద్విసభ్య ధర్మాసనం ఇరి వర్గాల వాదనలను వినడం జరిగింది. ఈమేరకు సెన్సార్ బోర్డు తరుపు న్యాయవాది జన నాయగన్ సినిమా రీ సెన్సార్ చేయడానికి మరో 20 రోజుల సమయం పడుతుంది అని వివరించారు. అలాగే నిర్మాణ సంస్థ తరుపున న్యాయవాది రిలీజ్ ఆలస్యం అవడం వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపాడు.

Dhurandhar 2 Teaser: ఆడియన్స్ గెట్ రెడీ.. దురంధర్ 2 టీజర్ వచ్చేస్తోంది.. అధికారిక ప్రకటన చేసిన టీం

ఇరువురి వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం తీర్పును మరోసారి వాయిదా వేసింది. దీంతో, ఈసారి ఖచ్చితంగా తుది తీర్పు వస్తుంది అని ఆశించిన మేకర్స్ కి నిరాశే మిగిలింది. దీంతో, జన నాయగన్ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రీ సెన్సార్ కి కనీసం 20 రోజుల సమయం పడుతుంది అని సూచించారు కాబట్టి వచ్చే నెలలో కూడా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం తక్కువే.

ఇక తీర్పు మళ్ళీ వాయిదా పడటంతో విజయ్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. నిజానికి జన నాయగన్(Jana Nayagan) సినిమా జనవరి 9 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, సెన్సార్ అభ్యంతరాల కారణంగా చివరి నిమిషంలో సినిమా వాయిదా పడింది. ఇక అక్కడి నుంచి ఈ సినిమా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఓపక్క ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే, ఇది విజయ్ కెరీర్ లో చివరి సినిమా కావడం. అందుకే, తమ హీరోకి బ్లాక్ బస్టర్ సెండాఫ్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ, సినిమా మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు.