Director Ram Gopam Varma Reacts on Konda Surekha Comments
Konda Surekha – RGV : మంత్రి కొండా సురేఖ నిన్న కేటీఆర్ పై విమర్శలు చేస్తూ నాగచైతన్య, సమంతలని ఉద్దేశించి పలు సంచలన ఆరోపణలు చేయడంతో దీంతో కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ, సినీ పరిశ్రమ ఫైర్ అవుతుంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, నాని.. సహా అనేకమంది కొండా సురేఖ వ్యాఖ్యలను విమర్శిస్తూ ట్వీట్స్ చేసారు. ఈ క్రమంలో ఆర్జీవీ కూడా కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించారు.
ఆర్జీవీ తన సోషల్ మీడియాలో కొండా సురేఖ కామెంట్స్ పై స్పందిస్తూ.. నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకి లాగడం ఏ మాత్రం భరించకూడదు. KTRని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో లేదో నాకర్ధమవ్వటం లేదు. తనని రఘునందన్ ఇష్యూలో ఎవరో అవమానించారని అసలు ఆ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి? 4th గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం. ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే ఇన్‌టర్‌ఫేర్ అయ్యి ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నాము అని ట్వీట్ చేసారు.
సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే ఇన్‌టర్‌ఫేర్ అయ్యి ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నాము https://t.co/YpSG8yzepd
— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2024
KTR ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో లేదో నాకర్ధమవ్వటంలేదు ?
తనని రఘునందన్ ఇష్యూ లో ఎవరో అవమానించారనీ అసలు ఆ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి? https://t.co/AA29iDzlQ6
— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2024
ఆర్జీవీకి నాగార్జునకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. తనకి మొదట డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చింది నాగార్జునే అని ఆయన పట్ల కృతజ్ఞత భావంతో ఉంటారు ఆర్జీవీ. దాంతోనే ఆర్జీవీ ఇలా స్పందించి ఉంటారు అని నెటిజన్లు అంటున్నారు. అయితే గతంలో కొండా సురేఖ భర్త కొండా మురళి జీవిత కథని కొండా అనే టైటిల్ తో ఆర్జీవీ నిర్మాణంలో సినిమా తీసిన సంగతి తెలిసిందే.