Chiranjeevi – Konda Surekha : కొండా సురేఖ వ్యాఖ్యలపై మెగాస్టార్ రియాక్షన్.. సినిమా వ్యక్తులను వారి రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటు..

కొండా సురేఖ వ్యాఖ్యలపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు.

Chiranjeevi – Konda Surekha : కొండా సురేఖ వ్యాఖ్యలపై మెగాస్టార్ రియాక్షన్.. సినిమా వ్యక్తులను వారి రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటు..

Megastar Chiranjeevi Reaction on Konda Surekha Tweet goes Viral

Updated On : October 3, 2024 / 9:33 AM IST

Chiranjeevi – Konda Surekha : మంత్రి కొండా సురేఖ నిన్న కేటీఆర్ పై విమర్శలు చేస్తూ నాగచైతన్య, సమంతలని ఉద్దేశించి పలు సంచలన ఆరోపణలు చేసారు. అలాగే సినీ పరిశ్రమ హీరోయిన్స్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ, సినీ పరిశ్రమ ఫైర్ అవుతుంది. ఇప్పటికే అనేకమంది సినీ ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలని విమర్శిస్తూ ట్వీట్స్ చేయగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు.

Also Read : Konda Surekha : కొండా సురేఖ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్న సినీ పరిశ్రమ.. సమంతకు సపోర్ట్ గా స్పందిస్తున్న నటీనటులు..

చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. సెలబ్రిటీలు, సినిమా వ్యక్తులను వారి రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటు. మా సినీ పరిశ్రమ సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటలను అందరం కలిసి వ్యతిరేకిస్తాం. సంబంధం లేని వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను తమ రాజకీయాల్లోకి లాగడం, ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి రాజకీయంగా ఉపయోగించుకునే స్థాయికి ఎవరూ దిగజారకూడదు. సమాజాన్ని ఉద్దరించడానికి నాయకులను ఎన్నుకుంటాము అంతేకాని ఇలాంటి ప్రసంగాలు చేసి దాన్ని కలుషితంగా మార్చకూడదు. రాజకీయ నాయకులు, గౌరవ స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు మంచి ఉదాహరణగా ఉండాలి. దీనికి సంబంధిత వ్యక్తులు ఈ హానికరమైన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి అని అన్నారు. దీంతో మెగాస్టార్ ట్వీట్ వైరల్ గా మారింది.

ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ, సమంత, ఎన్టీఆర్, నాని, కోన వెంకట్.. చాలా మంది సినీ ప్రముఖులు స్పందించగా ఇప్పుడు మెగాస్టార్ కూడా రిప్లై ఇవ్వడంతో ఈ ఇష్యూ పై సినీ పరిశ్రమ మరింత ఫోకస్ చేసేలా ఉంది.