Anil Ravipudi : అనిల్ రావిపూడిని ట్రోల్ చేసే వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన బేబీ డైరెక్టర్.. 8 వరుస హిట్స్ సాధించిన డైరెక్టర్..

బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ అనిల్ రావిపూడిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే వారికి కౌంటర్ ఇస్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

Director Sai Rajesh Counter to Who Trolled Anil Ravipudi

Anil Ravipudi : అనిల్ రావిపూడి తాజాగా వెంకటేష్ హీరోగా సంక్రాతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. ఫ్యామిలీలు అన్ని సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వెళ్తున్నారు. సాంగ్స్ తోనే ఈ సినిమాకు ఫుల్ క్రేజ్ తెప్పించాడు. ప్రమోషన్స్ తో ఆసక్తి నెలకొల్పాడు సినిమాపై. మొదటి రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఇంకో రెండు రోజుల వరకు సంక్రాంతికి వస్తున్నాం ఉన్న ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో బుకింగ్స్ అయిపోయాయి. అయితే అనిల్ రావిపూడి మొదటి నుంచి తన కామెడీని నమ్ముకొని ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని సినిమాలు తీస్తాడు. కొంతమంది యూట్యూబ్ రివ్యూయర్లు, సోషల్ మీడియాలో కొంతమంది అనిల్ రావిపూడిది క్రింజ్ కామెడీ అని ట్రోల్ చేస్తారు. జబర్దస్త్ కామెడీ అని, కథ ఏం ఉండదని, ఏదో నెట్టుకొచ్చేస్తున్నాడని ట్రోల్స్ చేస్తుంటారు.

Also See : Daaku Maharaaj : ‘డాకు మహారాజ్‌’ మేకింగ్‌ వీడియో చూశారా!

అనిల్ రావిపూడి ప్రతి సినిమాకు కొంతమంది సినిమా ముందు నుంచే ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. అనిల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. అలాంటి ట్రోల్స్ పట్టించుకోను. నా ఆడియన్స్ నాకు ఉన్నారు. వాళ్ళ కోసం సినిమాలు తీస్తాను అన్నారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తున్నా, హిట్ అయినా కొంతమంది మాత్రం ఎప్పట్లాగే అనిల్ ని టార్గెట్ చేసి క్రింజ్ కామెడీ అంటూ విమర్శలు చేస్తున్నారు.

దీంతో బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ అనిల్ రావిపూడిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే వారికి కౌంటర్ ఇస్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

సాయి రాజేష్ తన పోస్ట్ లో.. కొంతమంది ఇతని కంటెంట్ ని రాడ్ పూడి అంటారు. కొంతమంది క్రిటిక్స్ క్రింజ్ అంటారు. కొంతమంది యూట్యూబర్స్ ఇతన్ని ట్రోల్ చేస్తూ వీడియోలు చేస్తారు. కానీ ఇతనెప్పుడూ తన మార్గాన్ని మార్చుకోలేదు. ఇతని సినిమాల టికెట్స్ కొని నిర్మాతలకు ప్రాఫిట్స్ ఇచ్చే ఆడియన్స్ ని ఇతను గౌరవిస్తాడు. ఇతను తన హార్ట్ చెప్పింది వింటాడు. కొంతమంది యూట్యూబర్స్ ట్రాప్ లో పడడు. ఇవాళ ఇతను 8 వరుస హిట్స్ తో సక్సెస్ ఫుల్ గా నిలిచాడు. ఇవాళ 356 కి 356 షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. వందల మంది కుటుంబాలు టికెట్స్ కొనుక్కొని వాళ్ళ సమస్యలు మర్చిపోయి రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకున్నారు. మీ హార్ట్ ఏం చెప్తే అదే వినండి. ఎవరూ చెప్పేది వినకండి. మనసా వాచా కర్మణా మీ పని చేయండి సక్సెస్ అదే వస్తుంది. అనిల్ రావిపూడి కంగ్రాట్స్. ప్రతి దర్శకుడు నీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అని రాసుకొచ్చారు.

దీంతో సాయి రాజేష్ పోస్ట్ వైరల్ గా మారింది. పలువురు సినిమా లవర్స్, నెటిజన్లు సాయి రాజేష్ కి మద్దతు పలుకుతూ అనిల్ రావిపూడిని అభినందిస్తున్నారు. వరుసగా 8 సినిమాలు హిట్ కొట్టడమంటే మాములు విషయం కాదు. ఒక్క భగవంత్ కేసరి తప్ప మిగిలినవన్నీ కామెడీ కమర్షియల్ సినిమాలే. అందుకే అనిల్ రావిపూడికి ఫ్యామిలీ ఆడియన్స్ పట్టం కడుతున్నారు.

Also Read : Director Shankar : గేమ్ ఛేంజర్ 2 పార్ట్స్ అనుకున్నారా? శంకర్ కామెంట్స్ వైరల్.. ఇంకా 2 గంటల సినిమా మిగిలిపోయింది..