Director Shankar : గేమ్ ఛేంజర్ 2 పార్ట్స్ అనుకున్నారా? శంకర్ కామెంట్స్ వైరల్.. ఇంకా 2 గంటల సినిమా మిగిలిపోయింది..

తాజాగా ఓ తమిళ మీడియాతో మాట్లాడుతూ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరిన్ని విమర్శలకు దారి తీసింది.

Director Shankar : గేమ్ ఛేంజర్ 2 పార్ట్స్ అనుకున్నారా? శంకర్ కామెంట్స్ వైరల్.. ఇంకా 2 గంటల సినిమా మిగిలిపోయింది..

Director Shankar Interesting Comments on Ram Charan Game Changer Movie

Updated On : January 15, 2025 / 3:34 PM IST

Director Shankar : దిల్ రాజు నిర్మాణంలో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా భారీగా తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో, అద్భుతమైన విజువల్స్ తో శంకర్ సినిమాని తెరకెక్కించాడు. జనవరి 10న రిలీజయిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. దానికి తోడు కొంతమంది హీరోల ఫ్యాన్స్ నుంచి ఈ సినిమాపై బాగా నెగిటివిటి ఎక్కువ అయింది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెగిటివ్ గా ప్రచారం చేయడం, రిలీజయిన రెండో రోజే HD ప్రింట్ పైరసీ అవ్వడం, బస్సుల్లో, లోకల్ సిటీ కేబుల్ ఛానల్స్ లో సినిమా వేయడంతో ఈ సినిమాకు బాగా ఎఫెక్ట్ అయింది.

Also Read : Daaku Maharaaj Collections : బాలయ్య ‘డాకు మహారాజ్’ మూడు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ఇప్పటికే సినిమాని పైరసి చేసిన వారిపై మూవీ యూనిట్ సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసింది. పైరసీ విషయంలో మూవీ యూనిట్ సీరియస్ గా ఉంది. అయితే సినిమా కూడా పాత కథతో ఎక్కువ ఖర్చు పెట్టి తీయడంతో డైరెక్టర్ పై విమర్శలు వస్తున్నాయి. అవసరం లేకపోయినా పాటలకు 75 కోట్లు ఖర్చు పెట్టించాడు శంకర్ అని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఓ తమిళ మీడియాతో మాట్లాడుతూ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరిన్ని విమర్శలకు దారి తీసింది.

శంకర్ మాటాడుతూ.. నేను గేమ్ ఛేంజర్ సినిమా అవుట్ ఫుట్ తో సంతృప్తి చెందలేదు. దాన్ని ఇంకా బెటర్ చేయొచ్చు. చాలా మంచి సీన్స్ నిడివి ఎక్కువ అవుతుందని కట్ చేసాము. సినిమా మొత్తం నిడివి 5 గంటల పైనే ఉంటుంది. కొన్ని సీన్స్ కట్ చేసాము అని తెలిపారు. దీంతో దిల్ రాజు డబ్బుని బాగా వేస్ట్ చేసాడని శంకర్ పై విమర్శలు వస్తున్నాయి.

కట్ చేసిన సీన్స్ లో.. చరణ్ – కియారా మధ్య లవ్ సీన్స్, ఒక సాంగ్, చిన్నప్పుడు చరణ్ మిస్ అవ్వడం, వేరే ఫ్యామిలీకి దొరకడం, చరణ్ – తనని పెంచిన కుటుంబంతో సీన్స్, అప్పన్న పాత్రకు సంబంధించి కొన్ని సీన్స్, అంజలి ముసలి పాత్ర సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. అయితే గతంలో గేమ్ ఛేంజర్ సినిమా రెండు పార్ట్స్ గా వస్తుందని పలు వార్తలు వచ్చాయి. మొత్తం సినిమా 5 గంటల పైనే అని శంకర్ చెప్పడంతో ఆ వార్తలు నిజమే అని భావిస్తున్నారు.

Also See : Keerthy Suresh : పెళ్లి తర్వాత మొదటి సంక్రాంతి.. భర్తతో కీర్తి సురేష్ సెలబ్రేషన్స్ ఫోటోలు చూశారా?

కాకపోతే సినిమా అవుట్ ఫుట్ చూసిన తర్వాత రెండు భాగాలకు స్కోప్ లేకపోవడంతో చాలా సీన్స్ ట్రిమ్ చేసి ఒక్క పార్ట్ కే పరిమితం చేసారని తెలుస్తుంది. ఇటీవల చాలా మంది డైరెక్టర్స్, సీనియర్ హీరోలు ఎక్కువ వేస్టేజ్ తీయొద్దు. ప్రీ ప్రొడక్షన్ లోనే పర్ఫెక్ట్ గా రాసుకొని షూటింగ్ చేయండి, నిర్మాతకు ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టించొద్దు అని చెప్తున్నారు. చిరంజీవే ఈ విషయం ఇటీవల పలుమార్లు చెప్పారు. కానీ శంకర్ ఆల్మోస్ట్ 2 గంటల ఫుటేజ్ వేస్ట్ చేయడంతో ఫ్యాన్స్, సినిమా లవర్స్ విమర్శలు చేస్తున్నారు. మరి ఆ కట్ చేసిన సీన్స్ అన్ని విడిగా యూట్యూబ్ లో కానీ ఓటీటీలో కానీ రిలీజ్ చేస్తారేమో చూడాలి.