Sandeep Reddy Vanga : స్టోరీ మొత్తం లీక్ చేసినా భ‌య‌ప‌డ‌ను.. దీపికా పదుకోన్ పై సందీప్ రెడ్డి వంగా కౌంట‌ర్‌..?

ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా సంచ‌ల‌న ట్వీట్ చేశాడు.

ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా.. ఎలాంటి విష‌యంలోనైనా త‌న అభిఫ్రాయాన్ని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లుగా చెబుతూ ఉంటాడు. తాజాగా ఆయ‌న ఓ సంచ‌ల‌న ట్వీట్ చేశాడు. ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పీఆర్ టీమ్ త‌న సినిమా స్టోరీని లీక్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుందంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆరోపించారు.

కొద్ది రోజుల క్రితం తాను ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు క‌థ చెప్పిన‌ట్లుగా తెలిపాడు. వంద‌శాతం న‌మ్మ‌కంతోనే ఆమెకు క‌థ‌ను వివ‌రించాన‌న్నాడు. ద‌ర్శ‌కులు న‌టీన‌టుల‌కు స్టోరీ నెరేట్ చేశారంటే వారి మ‌ధ్య అన‌ధికారిక నాన్ డిస్‌క్లోజ‌ర్ అగ్రిమెంట్ ఉన్న‌ట్లే లెక్క అని అన్నాడు. దీంతో వారు స్టోరీని వారు ఎవ్వ‌రికి చెప్ప‌కూడ‌దన్నాడు. కానీ స‌ద‌రు హీరోయిన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి.. స్టోరీని లీక్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారని సందీప్ వంగా పేర్కొన్నాడు.

‘ఓ చిన్న పాత్ర అని భావించి మీరు సినిమా నుంచి తప్పుకున్నారా..? మీ స్త్రీ వాదం దీనినే సూచిస్తుందా..? ఓ యువ హీరోయిన్‌ను ఎద‌గ‌కుండా చేయ‌డం, ఎంతో క‌ష్ట‌ప‌డి రాసుకున్న క‌థ‌ను లీక్ చేయ‌డం..ఇదేనా మీ దృష్టిలో ఫెమినిజం అంటే ?.’ అని సందీప్ ప్ర‌శ్నించాడు.

Trivikram – Venkatesh : త్రివిక్రమ్‌ – వెంకీమామ సినిమా.. అసలు సంగతేంటి.. బన్నీ వెళ్లిపోవడంతో..

‘నాకు సినిమానే ప్ర‌పంచం. ఓ ద‌ర్శ‌కుడిగా ఎన్నో సంవ‌త్స‌రాలు ఎంతో క‌ష్ట‌ప‌డి క‌థ రాసుకున్నాను. ఎప్ప‌టికి మీరు దీన్ని అర్థం చేసుకోలేరు. కావాలంటే నా స్టోరీని మొత్తం లీక్ చేయండి, నేనేమీ భ‌య‌ప‌డ‌ను.’ అని సందీప్ వంగా ట్వీట్ చేశాడు. అని డర్టీ పీఆర్ గేమ్స్ #dirtyPRgames అనే హ్యాష్ ట్యాగ్‌ను సందీప్‌ జోడించాడు.

దీపిక‌నేనా?

యానిమ‌ల్ మూవీ త‌రువాత సందీప్ వంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం స్పిరిట్. త్వ‌ర‌లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తుండ‌గా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను తీసుకున్న‌ట్లు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఆ త‌రువాత కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె త‌ప్పుకున్న‌ట్లుగా కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే యువ క‌థానాయిక త్రిప్తి డిమ్రీని హీరోయిన్‌గా తీసుకున్న‌ట్లు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.

యువ క‌థానాయిక‌ను తీసుకోవ‌డం స‌ద‌రు స్టార్ హీరోయిన్‌కు న‌చ్చ‌క‌నే స్టోరీని లీక్ చేసి ఉంటార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. స‌ద‌రు స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనే అని అంటున్నారు.