Trivikram – Venkatesh : త్రివిక్రమ్‌ – వెంకీమామ సినిమా.. అసలు సంగతేంటి.. బన్నీ వెళ్లిపోవడంతో..

వెంకటేశ్‌, త్రివిక్రమ్ కాంబినేషన్‌ అనగానే.. నువ్వు నాకు నచ్చావ్‌, మళ్లీశ్వరి సినిమాలు గుర్తుకువస్తాయి.

Trivikram – Venkatesh : త్రివిక్రమ్‌ – వెంకీమామ సినిమా.. అసలు సంగతేంటి.. బన్నీ వెళ్లిపోవడంతో..

Venkatesh and Trivikram Srinivas Doing Film

Updated On : May 26, 2025 / 9:33 PM IST

Trivikram – Venkatesh : త్రివిక్రమ్‌ తో అల్లు అర్జున్‌ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో మైథలాజి మూవీ కూడా వస్తుందని అన్నారు. కానీ బన్నీ అట్లీతో సినిమా అనౌన్న్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. దీంతో త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ కాల్ షిట్స్‌ ఇప్పట్లో దొరకడం కష్టమని అర్థమైపోయింది. అట్లీతో టేకప్‌ చేసిన సినిమా కంప్లీట్‌ అయ్యేందుకు ఏడాది కాదు కదా రెండేళ్లు టైమ్‌ పట్టేలా కనిపిస్తోంది.

దీంతో చేసేదేమీ లేక మరో హీరోతో సినిమా చేయాలని త్రివిక్రమ్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. రెండేళ్లు ఖాళీగా ఉండేదానికి బదులు ఓ కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించాలని చూస్తున్నారట త్రివిక్రమ్. ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియెన్స్‌లో సూపర్‌ క్రేజ్‌ ఉన్న వెంకటేశ్‌తో చేసేందుకు ట్రై చేస్తున్నారట మాటల మాంత్రికుడు.

Also Read : Allu Arjun – Atlee : ఆగిపోయిన సినిమా టైటిల్ బయటకు తీసిన అల్లు అర్జున్.. అట్లీతో సినిమా టైటిల్ అదేనా?

వెంకటేశ్‌, త్రివిక్రమ్ కాంబినేషన్‌ అనగానే.. నువ్వు నాకు నచ్చావ్‌, మళ్లీశ్వరి సినిమాలు గుర్తుకువస్తాయి. ఈ రెండు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి సినిమాలకి డైలాగ్స్‌తో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందించారు త్రివిక్రమ్‌. అలాగే కరణాకరణ్ డైరెక్షన్‌ వచ్చిన వెంకటేశ్‌ వాసు సినిమాకి మాటలు రాసింది కూడా త్రివిక్రమే. కాని డైరక్టర్‌గా వెంకటేశ్‌తో కలిసి వర్క్‌ చేయలేదు త్రివిక్రమ్.

చాలా కాలంగా అనుకుంటున్నా కుదరని కాంబినేషన్‌ ఇది. ఇప్పుడు సెట్‌ అయ్యే చాన్సెస్‌ కనిపిస్తున్నాయి. వెంకటేవ్‌-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థలో తెరకెక్కించనున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్‌లో అదిరిపోయే హిట్‌ అందుకున్నారు విక్టరీ వెంకటేశ్. సరైన సినిమా పడాలే గానీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ నుంచి రెస్పాన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో నిరూపించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లు రాబట్టిన వెంకటేశ్‌ నెక్స్ట్‌ సినిమా విషయంలో సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది.

Also Read : Jaya Prakash Reddy : జయప్రకాశ్ రెడ్డి సినిమాలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా? సినిమాల్లోకి ఎలా వచ్చారంటే..

డైరెక్టర్‌ త్రివిక్రమ్‌తో సినిమా దాదాపు కన్ఫర్మ్‌ అయ్యిందనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్ గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇస్తాడని అంటున్నారు. ఈ సినిమాపై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ నెక్స్ట్‌ మంత్‌లో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు టాలీవుడ్ జనాలు. మరి చూడాలి వెంకీ – త్రివిక్రమ్‌ కాంబోలో సినిమా వస్తుందా, వస్తే ఏ రేంజ్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తుందో.