Allu Arjun – Atlee : ఆగిపోయిన సినిమా టైటిల్ బయటకు తీసిన అల్లు అర్జున్.. అట్లీతో సినిమా టైటిల్ అదేనా?

అట్లీ - అల్లు అర్జున్ సినిమాపై బోలెడన్ని రూమర్లు వినిపిస్తున్నాయి.

Allu Arjun – Atlee : ఆగిపోయిన సినిమా టైటిల్ బయటకు తీసిన అల్లు అర్జున్.. అట్లీతో సినిమా టైటిల్ అదేనా?

Allu Arjun Atlee Movie Title Rumors going Viral

Updated On : May 26, 2025 / 9:29 PM IST

Allu Arjun – Atlee : అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. పుష్ప 2 సినిమాతో భారీ రికార్డులు సాధించి ఇండియా వైడ్ ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. దీంతో బన్నీ నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ తమిళ్ డైరెక్టర్ అట్లీతో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని అనౌన్స్మెంట్ వీడియోతోనే చెప్పేసారు.

అప్పట్నుంచి అట్లీ – అల్లు అర్జున్ సినిమాపై బోలెడన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అయిదుగురు హీరోయిన్స్ ఉంటారని టాక్ నడుస్తుంది. ఇందులో అల్లు అర్జున్ డబల్ యాక్షన్ అని హీరో, విలన్ ఇద్దరూ బన్నీనే అని అంటున్నారు. తాజాగా ఈ సినిమాపై మరో టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ – అట్లీ సినిమా టైటిల్ ఇదే అని టాక్ నడుస్తుంది.

Also Read : Jaya Prakash Reddy : జయప్రకాశ్ రెడ్డి సినిమాలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా? సినిమాల్లోకి ఎలా వచ్చారంటే..

అల్లు అర్జున్ – అట్లీ సినిమా టైటిల్ ఐకాన్ అని టాలీవుడ్ లో రూమర్ వినిపిస్తుంది. గతంలో అల్లు అర్జున్ వకీల్ సాబ్ డైరెక్టర్ వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే టైటిల్ తో ఒక సినిమాని ప్రకటించాడు. ఆ సినిమా అనౌన్స్ చేసారు కానీ ముందుకెళ్ళలేదు. ఆ సినిమా అక్కడితోనే అయిపోయింది. ఇప్పుడు బన్నీ ఆ టైటిల్ తోనే రాబోతున్నాడట. ఎలాగో ఇప్పుడు బన్నీ ట్యాగ్ ఐకాన్ స్టార్ కాబట్టి ఐకాన్ అనే టైటిల్ పెడితే జనాల్లోకి సినిమా ఇంకా ఎక్కువగా వెళ్తుందని భావిస్తున్నారు. మరి అధికారికంగా టైటిల్ ప్రకటించేదాకా ఎదురుచూడాల్సిందే.

Also Read : Anchor Vindhya Vishaka : హెన్రిచ్ క్లాసెన్ తో యాంకర్ వింధ్య.. ఫొటోలు..