Jaya Prakash Reddy : జయప్రకాశ్ రెడ్డి సినిమాలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా? సినిమాల్లోకి ఎలా వచ్చారంటే..
ఆయన కూతురు మల్లికా రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన తండ్రి గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.

Do You Know how Jaya Prakash Reddy enter into Film Industry
Jaya Prakash Reddy : దాదాపు 300లకు పైగా సినిమాల్లో విలన్ గా, కమెడియన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన జయప్రకాశ్ రెడ్డి 2020 కరోనా సమయంలో మరణించారు. ఇటీవల ఆయన కూతురు మల్లికా రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన తండ్రి గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.
Also Read : Sumanth : తరుణ్ సూపర్ హిట్ సినిమా.. వదులుకున్నందుకు ఫీల్ అయ్యాను..
మల్లికా రెడ్డి మాట్లాడుతూ.. మా నాన్న గుంటూరు మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా చేసేవారు. 1985లో పిల్లలతో స్కిట్స్ వేయించడానికి వెళ్లినప్పుడు మా నాన్న కూడా కొన్ని స్కిట్స్ వేశారు. ఆ కార్యక్రమానికి రామానాయుడు గెస్ట్ గా వచ్చారు. ఆయన సినిమాల్లోకి రమ్మన్నారు. దాంతో నాన్న మద్రాస్ వెళ్లారు. కొన్ని సినిమాలు చేసాక అవకాశాలు లేకపోవడంతో 1993 లో మళ్ళీ వెనక్కి వచ్చి టీచర్ జాబ్ చేసారు. 1997లో మళ్ళీ రామానాయుడు గారికే కనపడటంతో సినిమాలు చేయకుండా వచ్చేసావా అని అడిగి మళ్ళీ తీసుకెళ్లారు. ప్రేమించుకుందాం రా సినిమాలో విలన్ వేషం ఇప్పించారు. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ వెనక్కి చూసుకోలేదు అని తెలిపారు.
Also Read : Dil Raju – Game Changer : గేమ్ ఛేంజర్ నేనే పైరసీ చేశాను అన్నారు.. అంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు..