Sumanth : తరుణ్ సూపర్ హిట్ సినిమా.. వదులుకున్నందుకు ఫీల్ అయ్యాను..

ఓ ఇంటర్వ్యూలో సుమంత్ ఆసక్తికర విషయం తెలిపాడు.

Sumanth : తరుణ్ సూపర్ హిట్ సినిమా.. వదులుకున్నందుకు ఫీల్ అయ్యాను..

Sumanth Tells about he Miss Tharun Nuvve Kavali Film Chance

Updated On : May 26, 2025 / 7:35 PM IST

Sumanth : సినీ పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో దగ్గరకు వెళ్తుంది. ఇలాంటివి అందరి హీరోలకు రెగ్యులర్ గా జరుగుతాయి. ఒకవేళ తాము వద్దనుకున్నా సినిమా కథలు వేరే హీరోలు చేసి హిట్ కొడితే కచ్చితంగా కొంతమంది ఫీల్ అవుతారు. అలా హీరో సుమంత్ కూడా ఫీల్ అయ్యాడట.

ఒకప్పుడు వరుస సినిమాలు చేసి మంచి విజయాలు అందించిన సుమంత్ ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ఓటీటీలో అనగనగా అనే సినిమాతో పలకరించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుమంత్ ఆసక్తికర విషయం తెలిపాడు.

Also Read : Dil Raju – Game Changer : గేమ్ ఛేంజర్ నేనే పైరసీ చేశాను అన్నారు.. అంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు..

సుమంత్ మాట్లాడుతూ.. నువ్వేకావాలి సినిమా ఆఫర్ నాకు వచ్చింది. కానీ అది నేను మిస్ చేసుకున్నాను. అందుకు ఫీల్ అయ్యాను అని తెలిపాడు. తరుణ్ హీరోగా 2000 సంవత్సరంలో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వేకావాలి సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. అది తరుణ్ కి హీరోగా మొదటి సినిమా. ఆ సినిమా ఒకటిన్నర కోట్లతో తీస్తే ఏకంగా 20 కోట్లు కలెక్ట్ చేసి భారీ విజయం సాధించింది. ఆ సినిమాకు మొదట సుమంత్ ని హీరోగా అనుకోని కథ కూడా చెప్పారు. కానీ సుమంత్ రిజెక్ట్ చేయడంతో ఆ ఛాన్స్ తరుణ్ కి వెళ్ళింది. ఆ సినిమా తరుణ్ కి మంచి డెబ్యూగా ఉపయోగపడింది.

Also Read : Dil Raju – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తిడితే పడతాం.. తప్పేముంది.. దిల్ రాజు కామెంట్స్..