Dil Raju – Game Changer : గేమ్ ఛేంజర్ నేనే పైరసీ చేశాను అన్నారు.. అంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు..
తాజాగా దిల్ రాజు నేడు థియేటర్స్ ఇష్యూ గురించి మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ గురించి వ్యాఖ్యలు చేసారు.

Dil Raju Comments on Game Changer Piracy
Dil Raju – Game Changer : డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో భారీగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా గత సంక్రాంతికి రిలీజయిన సంగతి తెలిసిందే. అయితే సినిమా యావరేజ్ గా ఉన్నా కొంతమంది హీరోల అభిమానులు, పలువురు నెటిజన్లు ఈ సినిమాకి కావాలని నెగిటివ్ ప్రమోషన్స్ చేసి బాగా డ్యామేజ్ చేసారు. అలాగే కొంతమంది సినిమా రిలీజ్ కి ముందే ఫ్లాప్ అని ట్రెండ్ చేసి, సినిమా పైరసీ చేసి లీక్ చేసి భారీ నష్టాన్ని మిగిల్చారు. ఇది సైబర్ క్రైమ్ వరకు కూడా వెళ్ళింది.
రిలీజ్ కి ముందే సినిమా లీక్ చేసారు. రిలీజ్ అయ్యాక బస్సుల్లో, లోకల్ ఛానల్స్ లో సినిమాని వేశారు. దీనిపై దిల్ రాజు బాగా సీరియస్ అయ్యారు. కొంతమంది డబ్బులివ్వకపోతే సినిమాని లీక్ చేస్తామని మూవీ యూనిట్ ని బెదిరించినట్టు కూడా వార్తలు వచ్చాయి. మొత్తానికి పైరసీ గేమ్ ఛేంజర్ సినిమాకు బాగా డ్యామేజ్ అయింది. ఆ సమయంలోనే దిల్ రాజు దీనిపై మాట్లాడారు. అయితే తాజాగా దిల్ రాజు నేడు థియేటర్స్ ఇష్యూ గురించి మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ గురించి వ్యాఖ్యలు చేసారు.
Also Read : Dil Raju : తెలంగాణలో మొత్తం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇన్నే.. అందులో నావి 30 మాత్రమే.. మిగిలినవి వాళ్ళవే..
దిల్ రాజు మాట్లాడుతూ.. ఒక నిర్మాత ఒక మీడియా ఛానల్ లో నా గేమ్ ఛేంజర్ సినిమాని నేనే పైరసీ చేశాను అని అన్నారు. కొంతమంది అంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు. మన ఇంట్లో మనిషిని మనం చంపుకుంటామా. అసలు నా సినిమాని నేను పైరసి చేస్తానా. అలా చేస్తే నాకే కదా నష్టం అని అన్నారు. ఇండస్ట్రీలో యూనిటీ లేదని చెప్తూ ఈ వ్యాఖ్యలు చేసారు. గేమ్ ఛేంజర్ గురించి అలా మాట్లాడిన నిర్మాత ఎవరో మాత్రం చెప్పలేదు.
Also Read : Dil Raju – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తిడితే పడతాం.. తప్పేముంది.. దిల్ రాజు కామెంట్స్..