Dil Raju : తెలంగాణలో మొత్తం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇన్నే.. అందులో నావి 30 మాత్రమే.. మిగిలినవి వాళ్ళవే..
నేడు దిల్ రాజు కూడా తెలంగాణలో ఉన్న సింగిల్ స్క్రీన్స్, అందులో ఆయనకు ఉన్న థియేటర్స్ గురించి తెలిపారు.

Dil Raju Tells about his Movie Theaters and Telangana Single Screens Theaters
Dil Raju : గత కొన్ని రోజులుగా థియేటర్స్ బంద్ అంటూ ప్రచారం జరుగుతూ నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య ఇష్యూ జరుగుతుంది. ఈ ఇష్యూ పై పవన్ కళ్యాణ్ సీరియస్ అవడంతో టాలీవుడ్ లో చర్చగా మారింది. అయితే థియేటర్స్ కొంతమంది నిర్మాతల చేతిలోనే ఉన్నాయి, వాళ్లే కంట్రోల్ చేస్తున్నారు అని ఆరోపణలు వచ్చాయి. ఈ ఇష్యూ గురించి నిన్న అల్లు అరవింద్ మీటింగ్ పెట్టగా నేడు నిర్మాత దిల్ రాజు మీటింగ్ పెట్టి మాట్లాడారు.
నిన్న అల్లు అరవింద్ మీటింగ్ పెట్టి తనకు ఏపీలో 15 థియేటర్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. నేడు దిల్ రాజు కూడా తెలంగాణలో ఉన్న సింగిల్ స్క్రీన్స్, అందులో ఆయనకు ఉన్న థియేటర్స్ గురించి తెలిపారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణలో 370 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయి. అందులో నా SVC సంస్థకు, నాకు రిలేటెడ్ ఉన్నవాళ్ళవి కలిపి 30 థియేటర్స్ మాత్రమే ఉన్నాయి. ఏషియన్ సునీల్ – సురేష్ వాళ్ళవి 90 థియేటర్స్ ఉన్నాయి. మిగిలిన 250 వేరే వాళ్ళవి, థియేటర్స్ ఓనర్స్ వి ఉన్నాయి. నాకు ఏపీలో ఉత్తరాంధ్రలో 20 థియేటర్స్ ఉన్నాయి. నిన్న అల్లు అరవింద్ కి 15 థియేటర్స్ ఉన్నాయని చెప్పారు అది నిజమే అని తెలిపారు.
Also Read : Dil Raju – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గారు తిడితే పడతాం.. తప్పేముంది.. దిల్ రాజు కామెంట్స్..