Aditi Shankar : డైరెక్టర్ శంకర్ తో కూతురు అదితి శంకర్ పోటీ.. సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్ కు పోటీగా..

గేమ్ ఛేంజర్ సినిమాని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Director Shankar Daughter Aditi Shankar Nesippaya Movie Fight with Game Changer movie

Aditi Shankar : సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. తమిళ్ లో పెద్ద సినిమాలు లేకపోవడంతో గేమ్ ఛేంజర్ సినిమాకు కలిసి రానుంది. కానీ పలు చిన్న సినిమాలు పోటీలో ఉన్నాయి. వాటిల్లో నెసిప్పాయ అనే సినిమా కూడా ఉంది.

Also Read : Ram Charan – Aravind : నాన్న, బాబాయ్ లతో వెళ్ళను.. ఆ విషయంలో అరవింద్ మామ బెస్ట్.. చరణ్ ఆసక్తికర కామెంట్స్..

గేమ్ ఛేంజర్ సినిమాని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తమిళ్ లో రిలీజ్ కాబోయే నెసిప్పాయ సినిమాలో శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. దీంతో తండ్రి సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తుందని తమిళ మీడియాలు అంటున్నాయి. ఇంతకీ ఈ నెసిప్పాయ సినిమాని డైరెక్ట్ చేసింది ఎవరో తెలుసా?

పవన్ కళ్యాణ్ పంజా సినిమాని డైరెక్ట్ చేసిన విష్ణువర్ధన్ ఈ నెసిప్పాయ సినిమాని డైరెక్ట్ చేసారు. ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా ఈ సినిమాని నిర్మించారు. అయితే దీనిపై అదితి ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. మా నాన్నకు నేను పోటీ కాదు. ఆయన సినిమాతో పాటు మా సినిమా కూడా వస్తుంది అని తెలిపింది.

Also Read : Balakrishna – Ram Charan : బాలయ్య, రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.. పండగ ఎపిసోడ్ ప్రోమో అదిరిందిగా..

అయితే కేవలం శంకర్ వర్సెస్ అదితి మాత్రమే కాదు ఈ సంక్రాంతికి తమిళ్ లో రామ్ చరణ్ వర్సెస్ నిహారిక కూడా పోటీ ఉంది. నిహారిక హీరోయిన్ గా నటించిన తమిళ సినిమా మద్రాస్ కారన్ కూడా జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ రోజే రిలీజ్ కానుంది. మరి తమిళ్ లో గేమ్ ఛేంజర్ కి పోటీగా వచ్చే చైనా సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తాయో చూడాలి.

ఇక శంకర్ కూతురు అదితి డాక్టర్ చదివిన తర్వాత నటిగా మారింది. ఓ పక్క హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరో పక్క సింగర్ గా కూడా పాటలు పాడుతుంది. ఇప్పటికే తెలుగు, తమిళ్ సినిమాల్లో పలు పాటలు పాడింది. త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్ భైరవం సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించనుంది.