Shankar : గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తర్వాత శంకర్ వెయ్యి కోట్ల సినిమా.. నిర్మాతలు దొరికేసారు.. యోధుడి కథతో హిట్ కొడతాడా?

శంకర్ తన డ్రీం ప్రాజెక్టు అంటూ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Shankar

Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ ఇటీవల ఫ్లాప్స్ చూస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇవ్వడంతో శంకర్ పని అయిపోయింది అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇంకా ఇండియన్ 3 కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ అది అవుతుందో లేదో కూడా క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో శంకర్ తన డ్రీం ప్రాజెక్టు అంటూ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

‘వేల్పరి’ బుక్ ఈవెంట్ లో డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. ఇప్పుడు నా డ్రీం ప్రాజెక్టు వేల్పరి. అవతార్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి సినిమాలకు వాడిన అత్యాధునిక టెక్నాలజీని వాడి ఆ రేంజ్ లో సినిమా తీయాలని ఉంది. ఇది మన తమిళ్ ఇండియన్ సినిమాగా గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది. ఈ డ్రీం ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి అని అన్నారు. దీంతో శంకర్ వ్యాఖ్యలు వైరల్ గా మారగా పలువురు విమర్శలు చేస్తున్నారు.

Also Read : Kota Srinivasa Rao : అన్నయ్యతో మొదటి సినిమా.. తమ్ముడితో చివరి సినిమా.. కోట శ్రీనివాసరావు చివరి సినిమా త్వరలో..

వేల్పరి సినిమాకు దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ అవుతుందని సమాచారం. వేల్పరి ఒక యోధుడు. కొన్ని వందల ఏళ్ళ క్రితం తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాలను పాలించిన యోధుడు. చోళులు, పాండ్యులను కూడా ఓడించాడు. ఆ చరిత్ర ఆధారంగా బుక్ రాయగా శంకర్ ఆ బుక్ ఆధారంగా సినిమాని తెరకెక్కిస్తానంటున్నాడు. దీంతో అసలు ఇప్పుడు శంకర్ ని నమ్మి వెయ్యి కోట్లు ఎవరు పెడతారు అంటూ ట్రోల్స్ చేసారు.

అయితే శంకర్ వేల్పరి సినిమాకు నిర్మాతలు దొరికారాని సమాచారం. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్, నెట్ ఫ్లిక్స్, సన్ పిక్చర్స్ సంస్థలు కలిసి శంకర్ వేల్పరి సినిమాని నిర్మిస్తాయని, వెయ్యి కోట్లకు పైగా ఖర్చుపెట్టి ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ సినిమాగా శంకర్ వేల్పరి నిలుస్తుందని తమిళ మీడియా అంటుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి నిజంగానే సన్ పిక్చర్స్, నెట్ ఫ్లిక్స్, కరణ్ జోహార్.. శంకర్ ని నమ్మి వెయ్యి కోట్ల బడ్జెట్ వేల్పరి సినిమాపై పెడతారా చూడాలి.

Also See : చనిపోయేవరకు నటిస్తానని చెప్పారు.. కోట శ్రీనివాసరావు గురించి పవన్ వ్యాఖ్యలు..