Kota Srinivasa Rao : అన్నయ్యతో మొదటి సినిమా.. తమ్ముడితో చివరి సినిమా.. కోట శ్రీనివాసరావు చివరి సినిమా త్వరలో..
కోట శ్రీనివాసరావు మొదటి సినిమా 1978లో ప్రాణం ఖరీదు.

Kota Srinivasa Rao
Kota Srinivasa Rao : విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు నేడు తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో, వయోభారంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి వచ్చి మరీ నివాళులు అర్పిస్తున్నారు.
కోట శ్రీనివాసరావు మొదటి సినిమా 1978లో ప్రాణం ఖరీదు. చిరంజీవి మొదటి సినిమా కూడా ఇదే. అలా చిరంజీవి, కోట శ్రీనివాసరావు ఇద్దరూ కలిసి ఒకే సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే కోట శ్రీనివాసరావు చివరి సినిమా ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు కోట శ్రీనివాసరావు చివరి సినిమా కన్నడ సినిమా కబ్జా. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు ఓ చిన్న పాత్రలో కనిపించారు.
Also See : చనిపోయేవరకు నటిస్తానని చెప్పారు.. కోట శ్రీనివాసరావు గురించి పవన్ వ్యాఖ్యలు..
అయితే ఆయన మరణించాక మరో సినిమా రిలీజ్ అవ్వనుంది. కోట శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటించారు. అదే ఆయన చివరి సినిమా కానుంది. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నేను పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో రెండు రోజులు నటించాను. ఒక చిన్న స్పెషల్ రోల్ కోసం మూవీ యూనిట్ నన్ను అడిగారు. నాకు ఓపిక లేకపోయినా పవన్ కళ్యాణ్ కోసం నటించాను అని తెలిపారు.
పవన్ కళ్యాణ్ తో కాంబినేషన్ సీన్ కోట శ్రీనివాసరావుకు ఉంటుందని సమాచారం. నేడు పవన్ కళ్యాణ్ కోట శ్రీనివాసరావు ఇంటికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. ఇక హరిహర వీరమల్లు సినిమా జులై 24 న రిలీజ్ కానుంది. ఇలా అన్నయ్య చిరంజీవితో ప్రాణం ఖరీదు కోట శ్రీనివాసరావు మొదటి సినిమా కాగా తమ్ముడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చివరి సినిమా కానుంది.
Also Read : Pawan Kalyan : నా మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో ఆయన.. కోట శ్రీనివాసరావు మృతిపై పవన్ కళ్యాణ్..