×
Ad

Arith Shankar: హీరోగా ఎంట్రీ ఇస్తున్న శంకర్ కొడుకు అర్జిత్‌.. డైరెక్టర్ ఎవరో తెలుసా..

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కొడుకు అర్జిత్‌ శంకర్(Arith Shankar) హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

Director Shankar's son Arjith Shankar is making his debut as a hero.

Arith Shankar: ఇండియాలో ఉన్న అగ్ర దర్శకుల లిస్టులో తప్పకుండా ఉండే పేరు శంకర్. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ దర్శకుడు, ఆయన చేసిన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, జీన్స్, ప్రేమికుడు, అపరిచితుడు, శివాజీ, రోబో ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని బ్లాక్ బస్టర్సే. సామజిక అంశలతో సినిమాలు చేయడం ఈ దర్శకుడి స్పెషాలిటీ. అందులోను కమర్షియల్ అంశాలకు పెద్ద పేట వేస్తూ ఉంటాడు. అలాంటి సినిమాలు చేయడంలో ఈయనే టాప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక శంకర్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అయన కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.

Rashmika Mandanna: డబ్బు కోసమే సినిమాలు.. నాకోసమే కథలు.. ఒక రకంగా ఇది నా విజయం..

ఇప్పుడు ఆయన వారసుడు అర్జిత్‌ శంకర్(Arith Shankar) సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అవును, హీరోగా తన మొదటి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు అర్జిత్‌ శంకర్. దీనికి సంబందించిన న్యూస్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను దర్శకుడు అట్లీ ప్రియ శిష్యుడు తెరకెక్కించనున్నాడట. అయితే ఆ దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కథా చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు మమిత బైజుని తీసుకోవాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ, కొన్ని కారణాల వల్ల ఆమెను కాదని ఇప్పుడు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని తీసుకుంటున్నారట. ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయట. ఈ మధ్య కృతి తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. అందుకే, ఈ అమ్మడును తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి స్టార్ శంకర్ కొడుకు అర్జిత్‌ శంకర్ తన మొదటి సినిమాతో ఏమేరకు మెప్పిస్తాడు అనేది చూడాలి.