Rashmika Mandanna: డబ్బు కోసమే సినిమాలు.. నాకోసమే కథలు.. ఒక రకంగా ఇది నా విజయం..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) గురించి ప్రత్యేకమైన పరిచేయం అవసరంలేదు. వరుస బ్లాక్ బస్టర్స్ కొడుతూ ప్రస్తుతం ఆమె టాప్ స్టార్ లిస్టులో చేరిపోయారు.

Rashmika Mandanna: డబ్బు కోసమే సినిమాలు.. నాకోసమే కథలు.. ఒక రకంగా ఇది నా విజయం..

Rashmika Mandanna made some interesting comments about her career

Updated On : December 29, 2025 / 10:57 AM IST

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచేయం అవసరంలేదు. వరుస బ్లాక్ బస్టర్స్ కొడుతూ ప్రస్తుతం ఆమె టాప్ స్టార్ లిస్టులో చేరిపోయారు. ఒక సినిమాలో ఆమె హీరోయిన్ అనే స్థాయి నుంచి ఇప్పుడు ఆమె కోసమే కథలు సిద్ధం చేసుకునే రేంజ్ కి ఆమె ఎదిగారు. ఈ ప్రయాణంలో ఆమె ఎంతో ట్రోలింగ్స్, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. కానీ, ఆమె ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. అందుకే, ఇప్పుడు వరుసగా భారీ సినిమాలు చేస్తూ వస్తున్నారు రష్మిక మందన్నా. ఈ స్టార్ బ్యూటీ లేటెస్ట్ నటిస్తున్న సినిమా మైసా.

Disha Patani: దిశా పటాని గ్లామర్ షోకి.. సోషల్ మీడియా షేక్.. ఫోటోలు

హీరోయిన్ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక(Rashmika Mandanna) అడవి బిడ్డగా మాస్ లోక్ లో కనిపించబోతుంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది ఈ సినిమాప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘ఒక నటిగా సినిమా సినిమాకీ నాపై బాధ్యత పెరుగుతోంది. పాత్రల కోసం వెతుకులాడే స్థాయి నుంచి మంచి పాత్రలు ఎంచుకునే స్థాయికి ఎదిగాను. డబ్బు కోసం సినిమాలు చేసే రోజులు పోయాయి. ఇప్పుడు నాకోసం ప్రత్యేకమైన కథలు సిద్ధమవుతున్నాయి.

ఓ రకంగా చెప్పలంటే ఇది నేను సాధించిన విజయంగా చెప్పుకోవాలి. ఇలాంటి పాత్రలే చేయాలని గిరి గీసుకులేదు. నాకోసం రచయితలు ఎలాంటి కథలు రెడీ చేస్తే, అవి నాకు నచ్చితే తప్పకుండా చేస్తూనే ఉంటాను. నాకు నాకన్నా రచయితల మీదనే నమ్మకం ఎక్కువ’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఇపుడు రష్మిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.