×
Ad

OG Success Meet: ఇంకా నమ్మలేకపోతున్నా.. పవన్ కళ్యాణ్ ని జస్ట్ చూస్తే చాలనుకున్నా.. సుజీత్ ఎమోషనల్ కామెంట్స్

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది(OG Success Meet). సెప్టెంబర్ 24 నుంచే ఈ సినిమా ప్రీమియన్స్ టెలికాస్ట్ అయ్యాయి.

Director Sujeeth emotional comments in og success meet

OG Success Meet: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. సెప్టెంబర్ 24 నుంచే ఈ సినిమా ప్రీమియన్స్ టెలికాస్ట్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో, బాక్సాఫీస్ దగ్గర భారీ (OG Success Meet)విజయాన్ని సాధించింది ఓజీ. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ సాధించిన నేపధ్యంలో చిత్ర యూనిక్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

OG Movie: స్టార్ హీరో మేనల్లుడు.. అయితేనేం, ఓజీ కోసం ఏకంగా షూటింగ్ క్యాన్సిల్ చేశాడు .. అది పవర్ స్టార్ రేంజ్!

ఈ కార్యక్రమంలో దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.. “ఇంకా నమ్మలేకపోతన్నా. నేను పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది మీ అందరికీ తెలుసు. జీవితంలో ఆయన్ని ఒకసారి చూస్తే చాలు అనుకున్నాను. అలాంటిది, ఇవాళ ఇంత పెద్ద సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టాను. అందుకు సహకరించిన అందరికీ న కృతజ్ఞతలు. ఈ సినిమా విషయంలో ముగ్గురు నాకు పిల్లర్స్ గా నిలుచున్నారు. ఒకరు తమన్, ఎడిటర్ నవీన్ నూలి, కెమెరామెన్ రవి కె చంద్రన్ సార్. ఈ ముగ్గురి వెళ్లే ఈ సినిమా ఇంతబాగా వచ్చింది. వాళ్ళు లేకపోతే ఓజీ లేదు.

ఒక్కోసారి తమన్ అన్న నమ్మకం చూస్తే భయమేసేది. ఏంటన్నా ఇది అంటే, నేను చూసుకుంటాను తమ్ముడు అనేవాడు. అంతలా ఓజీ కోసం కష్టపడ్డారు తమన్. ఓజీ సినిమా కోసం అన్ని రకాలుగా సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు”అంటూ చెప్పుకొచ్చాడు సుజీత్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.