Pawan Kalyan OG : పవన్ OG అసలు పేరు ఇదా.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదంట.. క్లారిటీ ఇచ్చిన సుజీత్..

OG అంటే అందరూ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే మీనింగ్ అనుకుంటున్నారు. డైరెక్టర్ సుజీత్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏపీ ఎన్నికల కారణంగా చేతిలో ఉన్న మూడు సినిమాలు గత కొన్నాళ్లుగా పక్కన పెట్టారు. పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఆ సినిమాల షూటింగ్స్ పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు. వీటిలో ముందు OG సినిమానే వస్తుంది. ఆల్రెడీ సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ తో OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

అభిమానులు పవన్ ని ఏ రేంజ్ మాస్ లో చూడాలనుకుంటున్నారో, ఎలాంటి లుక్స్ లో చూడాలి అనుకుంటున్నారో డైరెక్టర్ సుజీత్ OG అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపొయింది. పవన్ ఒక 20 రోజులు షూటింగ్ కి డేట్స్ ఇస్తే OG సినిమా మొత్తం పూర్తవుతుంది. ఎన్నికల రిజల్ట్స్ తర్వాత పవన్ OG సినిమాకు డేట్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ గ్యాంగ్‌స్టర్ గా నటిస్తున్నాడు. దీంతో OG అంటే అందరూ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే మీనింగ్ అనుకుంటున్నారు.

Also Read : Love Me Collections : అద‌ర‌గొట్టిన చిన్న సినిమా.. ల‌వ్‌మీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా?

అయితే డైరెక్టర్ సుజీత్ తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. భజే వాయువేగం సినిమా ప్రమోషన్స్ లో సుజీత్ పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో సుజిత్ మాట్లాడుతూ.. నాకు, పవన్ కళ్యాణ్ కి జపనీస్ సినిమాలు ఎక్కువ ఇష్టం. OG సినిమాలో OG అనేది క్యారెక్టర్ పేరు. OG అంటే ఓజాస్ గంభీర్. ఓజాస్ సినిమాలో పవన్ పాత్ర గురువు జపనీస్ వ్యక్తి పేరు, గంభీర్ అంటే పవన్ పాత్ర పేరు. రెండు కలిపి ఓజాస్ గంబీర్. అయితే అభిమానులు అనుకున్నట్టు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కూడా వస్తుందని అలా పెట్టాము అని తెలిపాడు. దీంతో పవన్ అభిమానులు ఈ పేరుని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు