Love Me Collections : అద‌ర‌గొట్టిన చిన్న సినిమా.. ల‌వ్‌మీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా?

ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా న‌టించిన చిత్రం ‘లవ్ మీ’.

Love Me Collections : అద‌ర‌గొట్టిన చిన్న సినిమా.. ల‌వ్‌మీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా?

Love Me Box Office Collection Day 1

Updated On : May 26, 2024 / 5:01 PM IST

Love Me : ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా న‌టించిన చిత్రం ‘లవ్ మీ’. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్ లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మాణంలో అరుణ్ దర్శకత్వలో ఈ సినిమా తెర‌కెక్కింది. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందించగా.. స్టార్ కెమెరామెన్ PC శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ద‌య్యంతో హీరో ప్రేమలో పడే ఆసక్తికర కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం శ‌నివారం (మే 25న‌) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

మొద‌టి రోజు ఈ సినిమా మంచి క‌లెక్ష‌న్స్ సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా మొద‌టి రోజు రూ.4.5కోట్ల వ‌సూలు చేసింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం తెలియ‌జేసింది. కాగా.. ఇటీవ‌ల కాలంలో ఓ చిన్న సినిమాకు ఫ‌స్ట్ డే ఈ స్థాయిలో క‌లెక్ష‌న్లు రావ‌డం ఇదే తొలిసారి. మ‌రీ రాబోయే రోజుల్లో కలెక్షన్లు ప‌రంగా ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సిందే.

Namo : సర్వైవల్ కామెడీ సినిమా ‘నమో’.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?

సినిమా క‌థ ఏమిటంటే..?

చిత్రం ప్రారంభంలో ఓ చిన్న ఊర్లో ఓ ఫ్యామిలీ, వాళ్ళని చూసి ఊరి వాళ్ళు భయపడటం, అందులో భార్య ఒంటికి నిప్పు అంటించుకొని చనిపోవడం, భర్త చనిపోవడం, వాళ్ళ పాప బతికి ఉన్నట్టు చూపిస్తారు. అసలు కథలోకి వస్తే అర్జున్(ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దయ్యాలు, ఆత్మలు, స్మశానాలు.. ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోలు చేస్తూ ఉంటారు. ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ ప్రియా(వైష్ణవి చైతన్య) కూడా వీళ్ళతో కలిసి పనిచేస్తుంది. ఓ రోజు ఆ పాప గురించి ఆసక్తికర న్యూస్ అర్జున్ దగ్గరికి వస్తుంది.

ఆ పాప పెద్దయ్యాక చనిపోయి దివ్యవతి అనే దయ్యం అయిందని, ఆ దయ్యాన్ని చూడటానికి వెళ్లినవాళ్ళందర్నీ చంపేస్తుందని ప్రియా చెప్పడంతో అర్జున్ అసలు ఆ దయ్యం కథేంటో చూద్దామని వెళ్లి ఆ దయ్యంతో ప్రేమలో పడతాడు. కానీ అక్కడ ఓ అమ్మాయి ఉందని గ్రహించి చనిపోయింది ఎవరు? అసలు దివ్యవతి ఎవరు అని రీసెర్చ్ చేయడం మొదలుపెడతారు. ఈ క్రమంలో ముగ్గురు అమ్మాయిలు చనిపోయినట్టు తెలియడంతో వాళ్ళకి దివ్యవతికి లింక్ ఏంటి అని వెతకడం మొదలుపెడతాడు. అసలు దివ్యవతి ఎవరు? ఆ పాప ఎవరు? ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? ఎలా చనిపోయారు? అర్జున్ దయ్యాన్ని ఎందుకు ప్రేమించాడు? దయ్యం అర్జున్ ని ఏం చేసింది? ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ అయిన ప్రియా అర్జున్ తో ఎలా ప్రేమలో పడింది? అసలు ప్రతాప్, అర్జున్ ఎవరు? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Vishwak Sen : మొన్న ఎన్టీఆర్.. ఇప్పుడు బాలయ్య బాబు.. విశ్వక్ కోసం వస్తున్న నందమూరి హీరోలు..]

 

View this post on Instagram

 

A post shared by @dilrajuprodctns