Pawan Kalyan : సుజిత్ సినిమాటిక్ యూనివర్స్.. పవన్ ఓజిలో ప్రభాస్ నిజంగానే ఉన్నడా?
ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ చేతిలో "ఓజి", "హరిహర వీరమల్లు" సినిమాలు ఉన్నాయి.

director Sujith Cinematic Universe Is Prabhas really there in Pawan Kalyan OG movie
Pawan Kalyan : ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ చేతిలో “ఓజి”, “హరిహర వీరమల్లు” సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే “హరిహర వీరమల్లు” సినిమా చివరి షూటింగ్ షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు పవన్ కళ్యణ్. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు మేకర్స్. 2025 మార్చి 28న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు కూడా.
అయితే పవన్ నటిస్తున్న మరో సినిమా ఓజి నుండి మాత్రం అప్డేట్స్ ఇవ్వడం లేదు మేకర్స్. కానీ నెట్టింట మాత్రం ఈ సినిమాకి సంబందించిన ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ సైతం కనిపించనున్నారని అంటున్నారు. ఓజి సెకండ్ హాఫ్ చివర్లో డార్లింగ్ కనిపిస్తారని తెలుస్తుంది.
Also Read : Movies : ‘మాకు ఫ్రీగా సినిమాలు వెయ్యాలి’.. విజయవాడ ఐఏఎస్ ఆఫీసర్స్ రిక్వెస్ట్.
దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఎందుకంటే.. ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ తో సుజిత్ సాహో సినిమా చేశారు. ఇక ఆయన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఓజీలో ప్రభాస్ నటించనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాలో డార్లింగ్ ఉన్నారా లేదా అన్నది తెలియాలంటే సుజిత్ ఈ విషయానికి సంబందించిన అప్డేట్ ఇవ్వాలి.