Adavallu Meeku Joharlu
Adavallu Meeku Joharlu: చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, లక్కీ స్టార్ గా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ సినిమాని ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేయగా భీమ్లా నాయక్ అదే డేట్ కి రావడంతో అప్పుడు వాయిదా వేసుకున్నారు. కాగా.. మార్చి 4న ఆడవాళ్లు మీకు జోహార్లు విడుదల కానుంది.
Adavallu Meeku Joharlu: థర్డ్ సింగిల్.. సూపర్బ్ బ్యూటిఫుల్ మెలోడీ!
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన యూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇప్పటికే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ కాగా.. ఈ మధ్యనే పుష్పతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకి ఆశీస్సులు అందిస్తున్నాడు. తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా హాజరవగా.. ఇప్పుడు ఈ సినిమాకు సుకుమార్ మరో సాయం చేశాడని మేకర్స్ ప్రకటించారు.
Aadavallu Meeku Joharlu Teaser: కోపం.. బాధ.. టెన్షన్.. ఫ్రస్టేషన్.. ఇరిటేషన్ చూపించే శర్వా!
ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా కోసం దర్శకుడు సుకుమార్ వాయిస్ ఓవర్ ఇచ్చాడని యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బుకింగ్స్ మొదలు పెట్టగా.. ఈ శుక్రవారం ఆడవాళ్ళతో కలిసి శర్వా థియేటర్లకి రాబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధిక శరత్‌కుమార్, ఖుష్బు సుందర్, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.