ప్రసాద్ ప్లేస్‌ని ఎవరూ రీప్లేస్ చేయలేరు – మిత్రుడి మరణంతో సుకుమార్ ఆవేదన..

గుండెపోటుతో దర్శకులు సుకుమార్ ప్రియ మిత్రుడు మరణం..

  • Published By: sekhar ,Published On : March 29, 2020 / 01:59 PM IST
ప్రసాద్ ప్లేస్‌ని ఎవరూ రీప్లేస్ చేయలేరు – మిత్రుడి మరణంతో సుకుమార్ ఆవేదన..

Updated On : March 29, 2020 / 1:59 PM IST

గుండెపోటుతో దర్శకులు సుకుమార్ ప్రియ మిత్రుడు మరణం..

ప్రముఖ దర్శకులు సుకుమార్ తనకి అత్యంత సన్నిహితుడు, ప్రియ మిత్రుడు, తన మేనేజర్ అయిన వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌ను కోల్పోయారు. ఈ షాకింగ్ న్యూస్ విన్న సుకుమార్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌.. సుకుమార్ స్నేహితుడు, మేనేజరే కాకుండా ‘అమరం అఖిలం ప్రేమ’ అనే చిత్రానికి నిర్మాత కూడా.

సుకుమార్‌కి అత్యంత సన్నిహితమైన వారిలో ఈ వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ ఒకరు. శనివారం మధ్యాహ్నం ఆయన తీవ్ర గుండె పోటుతో మరణించారు. ఎప్పుడు డిజప్పాయింట్‌కి లోనైనా.. తన మిత్రుడు వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్‌తో మాట్లాడితే మళ్లీ ఎనర్జీ వచ్చేదని, అంతగా తన లైఫ్‌లో ప్రసాద్ ముఖ్యపాత్ర పోషించారని సుకుమార్ తెలియజేశారు.

ఆయన మరణం తనకి తీర్చలేని లోటని, తనకి సంబంధించినంత వరకు ఎవ్వరూ ప్రసాద్ ప్లేస్‌ని రీప్లేస్ చేయలేరని తెలుపుతూ.. వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సుకుమార్..