Tiger Nageswara Rao : రవితేజ ఫ్యాన్స్‌కు సాలిడ్‌ అప్‌డేట్‌..మనం పెంచిన పులి వేటాడటానికి సిద్ధమయ్యింది

వ‌రుస విజ‌యాల‌తో మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) మంచి జోష్‌లో ఉన్నాడు. అదే ఉత్సాహంలో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నాడు

Tiger Nageswara Rao

Tiger Nageswara Rao Teaser : వ‌రుస విజ‌యాల‌తో మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) మంచి జోష్‌లో ఉన్నాడు. అదే ఉత్సాహంలో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఇందులో ఇండియ‌న్ రాబిడ్ హుడ్‌గా పిలవ‌బ‌డే గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వరరావు జీవిత క‌థ అధారంగా తెర‌కెక్కుతున్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు(Tiger Nageswara Rao) చిత్రం ఒక‌టి. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. ఈ సినిమా ద‌స‌రా కానుకగా అక్టోబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Baby OTT Release Date : బేబీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌..!.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే..?

తాజాగా ఈ చిత్ర ద‌ర్శ‌కుడు వంశీ సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘హలో తమ్ముళ్లు, మీ మెసేజ్ లు చూసి మళ్లీ మీకు ఆకలేస్తుందని అర్థమైంది. ఈ సారి మనం పెంచిన పులి వేటాడటానికి సిద్ధమయ్యింది. త్వరలోనే టీజర్ డేట్ అనౌన్స్ చేస్తాము. కొంచెం ఓపిక పట్టండి.’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో త్వ‌ర‌లోనే టీజ‌ర్ విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Thaman : తమన్‌ను టార్గెట్‌ చేస్తున్న మహేశ్‌, మెగా ఫ్యాన్స్‌.. ఎందుకిలా..?

అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. రేణుదేశాయ్‌ కీలకపాత్రలో న‌టిస్తోంది.