Director Vamshi Paidipally to direct Dil Raju upcoming film with Pawan Kalyan
Pawan-Dil Raju: ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆకలి తీర్చింది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్ పిచ్చెక్కిపోయారు. అసలు పవన్ కళ్యాణ్ అనే మాస్ కొటౌట్ కి పర్ఫెక్ట్ కంటెంట్ పడితే ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుందో ఓజీ సినిమా చూపించింది. కేవలం రీజనల్ సినిమాగా రిలీజైన ఓజీ మొదటిరోజే ఏకంగా రూ.154 కోట్ల కలెక్షన్స్ రాబట్టి పవన్ స్టార్(Pawan-Dil Raju) స్టామినా ఏంటో చూపించింది. అయితే, ఓజీ తరువాత పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి పూర్తిగా తప్పుకుంటారు అనుకున్నారు అంతా.
కానీ, ఓజీ ప్రీక్వెల్, సీక్వెల్ కూడా చేయడానికి అఫీషియల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవర్ స్టార్. అయితే, అంతకన్నా ముందే మరో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవల నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ ను కలిసి నెక్స్ట్ సినిమా కోసం డేట్స్ అడిగాడట. మంచి కథ సెట్ అయితే తప్పకుండా ఇస్తానని మాట ఇచ్చాడట పవన్ కళ్యాణ్. అప్పటి నుంచి కథ, దర్శకుల వేటలో ఉన్న దిల్ రాజు ఫైనల్ గా పవన్ కళ్యాణ్ కు సెట్ అయ్యేలా పర్ఫెక్ట్ కథను, దర్శకుడిని సెట్ చేశాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు వంశీ పైడిపల్లి.
మెసేజ్ ఓరియెంటెడ్ కథలతో సినిమాలు చేయడంలో ఈ దర్శకుడు దిట్ట. ఈ నేపథ్యంలోనే వంశీ చెప్పిన ఒక కథ దిల్ రాజుకి బాగా నచ్చిందట. ఆ కథకి పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఫిక్స్ అయ్యాడట. త్వరలోనే ఆ కథను పవన్ కళ్యాణ్ కి వినిపించి ప్రాజెక్టు లాక్ చేయించాలని భావిస్తున్నాడట. అయితే, పవన్ కళ్యాణ్ ప్రాజెక్టుకి వంశీ పైడిపల్లిని డైరెక్టర్ గా ఫిక్స్ చేయడంపై ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్మెంట్ లో ఉన్నారు. కారణం ఏంటంటే, గతంలో విజయ్, దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాంబోలో వారసుడు అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదల సమయంలో వంశీ పైడిపల్లిపై చాలా ట్రోలింగ్ జరిగింది. అది సినిమాలా కాదు సీరియల్ లా ఉందని కామెంట్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి దర్శకుడుతో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే నెగిటీవ్ ఇంపాక్ట్ పడుతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. అందుకే దయచేసి డైరెక్టర్ ను మార్చండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ పై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.