Rashmika-Sandeep: ఆ పాత్ర చేయనంటే చేయను.. రష్మిక సినిమాను రిజెక్ట్ చేసిన సందీప్.. కారణం ఏంటో తెలుసా..

సందీప్ రెడ్డి వంగా గురించి, ఆయన డైరెక్షన్ గురించి, ఆయన చేసే సినిమాల(Rashmika-Sandeep) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేది. మిగతా దర్శకులకి ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది.

Rashmika-Sandeep: ఆ పాత్ర చేయనంటే చేయను.. రష్మిక సినిమాను రిజెక్ట్ చేసిన సందీప్.. కారణం ఏంటో తెలుసా..

Sandeep Reddy Vanga rejected a character in Rashmika The Girlfriend Movie

Updated On : October 27, 2025 / 3:51 PM IST

Rashmika-Sandeep: సందీప్ రెడ్డి వంగా గురించి, ఆయన డైరెక్షన్ గురించి, ఆయన చేసే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేది. మిగతా దర్శకులకి ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే, ఆయనను చాలా మంది ఇష్టపడతారు. స్టార్ హీరోలు సైతం ఆయనతో ఒక సినిమా చేస్తే బాగుండు అని ఫీలవుతున్నారు అంటే సందీప్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. అయితే, తాజాగా సందీప్ రరెడ్డి వంగా ఒక సినిమాను రిజెక్ట్ చేశాడట. అది కూడా(Rashmika-Sandeep) రష్మిక సినిమాను. అవును, ఈ అమ్మడు సందీప్ కి అద్భుతమైన అవకాశం ఇచ్చిందట. కానీ, ఆ అవకాశాన్ని సింపుల్ గా రిజెక్ట్ చేశాడట సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sreeleela: ఆ విషయంలో నో చెప్పకూడదు.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్రీలీల

అసలు విషయం ఏంటంటే, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ “ది గర్ల్ ఫ్రెండ్”. చిలసౌ మూవీ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ కీ రోల్ లో కనిపించనుంది. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా. అయితే, ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం ముందు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను కలిశారట మేకర్స్. చిన్న పాత్ర అయితే చేద్దాం అనుకున్నాడట సందీప్ కానీ, సినిమాలో ఆ పాత్ర చాలాసేపు ఉంటుందట. అందుకే ఆ పాత్రలో చేయనంటే చేయను అని చెప్పేశాడట సందీప్ రెడ్డి.

ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన ఒప్పుకోలేదట ఆయన. ఇక చేసేదేం లేక చివరికి ఆ పాత్రను దర్శకుడు రాహుల్ రవీంద్రనే చేశాడట. కానీ, చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఆపాత్ర సందీప్ రెడ్డి వంగా చేసుంటే ఇంకా చాలా ఇంపాక్ట్ ఉండేదని టీం భావిస్తున్నారట. మరి టీం అంతలా చెప్తున్న ఆ పాత్ర ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియాలంటే నవంబర్ 7 వరకు ఆగాల్సిందే.