Sreeleela: ఆ విషయంలో నో చెప్పకూడదు.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్రీలీల

లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ "మాస్ జాతర"(Sreeleela). మాస్ రాజా రవితేజ హీరోగా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు.

Sreeleela: ఆ విషయంలో నో చెప్పకూడదు.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్రీలీల

Sreeleela reveals the qualities of her future husband

Updated On : October 27, 2025 / 3:21 PM IST

Sreeleela: లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ “మాస్ జాతర”. మాస్ రాజా రవితేజ హీరోగా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న(Sreeleela) ఈ సినిమా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా సినిమా విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అయితే, తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్రీలీల తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి అనేదానిపై క్లారిటీ ఇచ్చింది.

Dil Raju: మిరాయ్ ఎఫెక్ట్.. కుర్ర హీరోతో దిల్ రాజు భారీ సినిమా.. ఇక ప్రభాస్, విజయ్ పక్కకే..

ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మీకు కాబోయే వ్యక్తికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అడిగింది. దానికి సమాధానంగా శ్రీలీల మాట్లాడుతూ..”నాకు భర్తగా రాబోయే వ్యక్తి అందంగా లేకపోయినా పర్వాలేదు కానీ, అర్థం చేసుకునే వాడై ఉండాలి, మంచి మనసున్న వ్యక్తి కావాలి. అలాగే నా సినీ కెరీర్‌ పట్ల గౌరవం ఉండాలి. నన్ను చేసే ప్రతీ పనిలో ప్రేమతో ప్రోత్సహించి ముందుకు నడిపించాలి. సరదాగా ఉండాలి, నిజాయితీ ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకుంటా” అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే, మాస్ జాతర సినిమా తరువాత ఈ అమ్మడు తెలుగులో చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరో గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తమిళంలో శ్రీలీల చేస్తున్న సినిమా పరాశక్తి. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.