ప్రముఖ దర్శకులు వీర శంకర్‌ ఇంట్లో విషాదం

ప్రముఖ దర్శకులు వీర శంకర్‌కి పితృవియోగం.. నివాళులర్పిస్తున్న సినీ ప్రముఖులు..

  • Publish Date - February 18, 2020 / 08:57 AM IST

ప్రముఖ దర్శకులు వీర శంకర్‌కి పితృవియోగం.. నివాళులర్పిస్తున్న సినీ ప్రముఖులు..

‘విజయ రామరాజు’, ‘గుడంబా శంకర్’, ‘యువరాజ్యం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ దర్శకులు వీరశంకర్ తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ (83) ఈరోజు (ఫిబ్రవరి 18)  ఉదయం వారి స్వగ్రామం చివటం (తణుకు పక్కన)లో స్వర్గస్తులయ్యారు.

వారికి ముగ్గురు కుమారులు (వేణుగోపాలరావు, వెంకటేశ్వరావు, వీరశంకర్) ఉన్నారు. తండ్రి మరణం గురించి శోకతప్త హృదయంతో వీర శంకర్ మాట్లాడుతూ.. “మాకు నిజాయితీని, కష్టపడే తత్వాన్ని నేర్పిన మనిషి. ఆఖరి రోజుల్లో క్యాన్సర్ కారణంగా బాధని అనుభవించడం మమ్మల్ని కలచివేసింది.

 

వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మేము చేసే పోరాటానికి ఆయనే స్ఫూర్తి. నాన్న ఎప్పటికీ మాకొక మంచి జ్ఞాపకం” అన్నారు.. వీరశంకర్ తండ్రి మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయణ్ణి పరామర్శించి సంతాపం తెలిపారు.