Prasanth Varma – Venky Atluri : సినిమా హిట్.. అప్పుడు ప్రశాంత్ వర్మ తండ్రి.. ఇప్పుడు వెంకీ అట్లూరి తండ్రి.. ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్..

తాజాగా డైరెక్టర్ వెంకీ అట్లూరి తండ్రి కూడా తన కొడుకు సినిమా గురించి మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది.

Director Venky Atluri Father Reaction on Lucky Baskhar Success goes viral Prasanth Varma Reacts

Prasanth Varma – Venky Atluri : కొడుకు ఏదైనా సాధిస్తే అందరికంటే ముందు సంతోషించేది తల్లి తండ్రులే. మనం ఏదైనా సాధిస్తే దాన్ని మన తల్లి తండ్రులు ప్రశంసిస్తే అంతకంటే గొప్ప ఇంకోటి ఉండదు. ఇటీవల డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో పెద్ద హిట్ కొట్టినప్పుడు ప్రశాంత్ వర్మ తండ్రి సినిమా రివ్యూ చెప్తూ డైరెక్టర్ నా కొడుకు అంటూ గర్వంగా చెప్పుకున్నారు. సినిమాని అభినందించి ప్రశాంత్ వర్మని పొగిడాడు. అప్పట్లో ఈ వీడియో వైరల్ అయింది.

అయితే తాజాగా డైరెక్టర్ వెంకీ అట్లూరి తండ్రి కూడా తన కొడుకు సినిమా గురించి మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. వెంకీ అట్లూరి ఈ దీపావళికి లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఐ మాక్స్ లో సినిమా చూసిన వెంకీ అట్లూరి తండ్రి అక్కడ బయట యూట్యూబ్ వాళ్లకు సినిమా గురించి చెప్తూ.. సినిమా చాలా బాగుంది. మిడిల్ క్లాస్ పీపుల్ కి బాగా కనెక్ట్ అయింది. సినిమా డైరెక్టర్ మా అబ్బాయి. సినిమాకు 4 రేటింగ్ ఇస్తాను అని అన్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read : Daali Dhananjaya : కాబోయే భార్యతో ఫొటోలు షేర్ చేసిన పుష్ప విలన్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ..

అప్పుడు ప్రశాంత్ వర్మ తండ్రి గర్వపడితే ఇప్పుడు వెంకీ అట్లూరి తండ్రి గర్వపడుతున్నారు కొడుకుల సక్సెస్ చూసి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే వెంకీ అట్లూరి తండ్రి మాట్లాడిన వీడియోని ప్రశాంత్ వర్మ షేర్ చేస్తూ.. కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తి తండ్రి నుంచి ఇలాంటి ప్రశంసలు అందుకోడానికి అర్హుడు అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్ గా మారింది.