Dulquer Salmaan : భార్యకు భయపడి సగం కార్లు హైదరాబాద్ లో దాచి.. సొంత కారును సినిమాలో వాడి.. ఈ హీరోకి మొత్తం ఎన్ని కార్లంటే..

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి కూడా కార్లంటే పిచ్చి అంట.

Dulquer Salmaan : భార్యకు భయపడి సగం కార్లు హైదరాబాద్ లో దాచి.. సొంత కారును సినిమాలో వాడి.. ఈ హీరోకి మొత్తం ఎన్ని కార్లంటే..

Interesting Story about Dulquer Salmaan Cars and his craze about Cars

Updated On : November 2, 2024 / 11:03 AM IST

Dulquer Salmaan : మన సెలబ్రిటీలలో చాలా మందికి కార్లు, బైక్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంది. బాగా డబ్బులు సంపాదించి మార్కెట్ లోకి వచ్చిన ప్రతి మోడల్, తమకు నచ్చిన కార్లు, బైక్స్ కొనేస్తుంటారు. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి కూడా కార్లంటే పిచ్చి అంట. నచ్చిన ప్రతి కార్ కొనేస్తాడట. మలయాళంలో స్టార్ హీరోగా ఎదిగిన దుల్కర్ ప్రస్తుతం అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నాడు.

దుల్కర్ తెలుగులో తాజాగా లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో తన గురించి బోలెడన్ని విషయాలు తెలిపాడు. లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ నిస్సాన్ పాట్రోల్ అనే ఓ జీప్ మోడల్ కార్ ని వాడతారు. అయితే ఆ కార్ అతని సొంత కార్ అట. దానికి కొన్ని రిపైర్స్, మార్పులు చేసి సినిమాలో కథకు తగ్గట్టు మార్చారని తెలిపాడు దుల్కర్.

Also See : Daali Dhananjaya : కాబోయే భార్యతో ఫొటోలు షేర్ చేసిన పుష్ప విలన్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ..

అలాగే దుల్కర్ దగ్గర ఆల్మోస్ట్ 70 కార్లు ఉన్నాయట. వాళ్ళ ఆవిడకు తెలిస్తే తిడుతుందని కొన్ని కార్లు హైదరాబాద్ లో ఫ్రెండ్స్ ఇళ్లల్లో దాస్తాడని లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి బాలయ్య అన్ స్టాపబులు షోలో తెలిపాడు. ఈ విషయం తెలిసి నెటిజన్లు, ఫ్యాన్స్ వామ్మో ఏకంగా 70 కార్లు ఉన్నాయా దుల్కర్ దగ్గర అని ఆశ్చర్యపోతున్నారు.