Director Venky Atluri planning a sequel For Lucky Bhaskar Movie
Lucky Bhaskar Sequel: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన రీసెంట్ తెలుగు మూవీ లక్కీ భాస్కర్. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ త్రిల్లర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలు, స్టాక్ మార్కెట్ నేపధ్యంలో సాగే ఈ కథ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించండి. రొటీన్ కి బిన్నంగా ఉండే కథ, నెక్స్ట్ ఎం జరుగుతుంది అనిపించేలా కథనం, మధ్యలో మధ్యలో వచ్చే థ్రిల్లింగ్ సీన్స్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. అందుకే, ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక భాస్కర్ గా బ్యాంకు ఉద్యోగి పాత్రలో దుల్కర్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పాత్రలో నటించాడు అనేకంటే జీవించాడు అనే చెప్పాలి.
ఇక సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే మైండ్ బ్లాక్ అనే చెప్పాలి. అందుకే, ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికి టీవీలో వచ్చినా చూస్తూనే ఉంటారు. అలాంటిది, ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుందట. అవును, తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం ఆయన తమిళ హీరో సూర్యతో సరికొత్త కథతో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే లక్కీ భాస్కర్ సీక్వెల్(Lucky Bhaskar Sequel) మొదలుపెట్టనున్నాడట దర్శకుడు.
ఇక, లక్కీ భాస్కర్ సినిమా క్లైమాక్స్ లో హీరో సమస్యల నుంచి తప్పించుకొని తన ఫ్యామిలీని తీసుకొని విదేశాలకు వెళ్ళిపోతాడు. అలా వెళ్లిన హీరో 2027లో ఇండియాకి తిరిగి వస్తే ఎలా ఉంటుంది. తన మాస్టర్ బ్రెయిన్ ను ఉపయోగించి మరో స్కామ్ మొదలుపెడితే ఎలా ఉంటుంది. అది కూడా ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకోని. వింటుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కదా. సరిగా అలాంటి కథతోనే ఈ సీక్వెల్ ను ప్లాన్ చేయబోతున్నాడట వెంకీ అట్లూరి. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది అని టాక్ నడుస్తోంది. ఆలాగే, ఈ సీక్వెల్ లో హీరో మారుతాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ, ఆ పాత్ర దుల్కర్ తప్పా వేరే ఎవరు చేసిన ఆ ఇంపాక్ట్ రాకపోవచ్చు కాబట్టి, మారె అవకాశం ఉండదేమో. మరి అందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.